Sabarimala: శబరిమల ప్రసాదం కావాలా..ఆలయానికి వెళ్లకుండానే తెప్పించుకోవచ్చు ఇలా

Sabarimala: శబరిమల ప్రసాదం తెలుసు కదా..అత్యంత ప్రీతిపాత్రమైంది. కరోనా కారణంగా వెళ్లలేకపోతున్నామనే చింత వద్దు. ఇంట్లో కూర్చుని ఇష్టమైన ప్రసాదాన్ని తెప్పించుకోవచ్చు. ఎలాగంటారా..

Last Updated : Dec 1, 2020, 07:34 PM IST
  • శబరిమల వెళ్లకుండానే ప్రీతిపాత్రమైన ఆ ప్రసాదాన్ని ఇంటికి తెప్పించుకోవచ్చు
  • మీకు సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి..శబరిమల ప్రసాదం పేరుతో ఉన్న ఫామ్ ఫిల్ చేసి డబ్బులు చెల్లించండి
  • వారం రోజుల్లో ప్రసాదం కిట్ మీ ఇంటికి వచ్చేస్తుంది.
Sabarimala: శబరిమల ప్రసాదం కావాలా..ఆలయానికి వెళ్లకుండానే తెప్పించుకోవచ్చు ఇలా

Sabarimala: శబరిమల ప్రసాదం తెలుసు కదా..అత్యంత ప్రీతిపాత్రమైంది. కరోనా కారణంగా వెళ్లలేకపోతున్నామనే చింత వద్దు. ఇంట్లో కూర్చుని ఇష్టమైన ప్రసాదాన్ని తెప్పించుకోవచ్చు. ఎలాగంటారా..

శబరిమల ( Sabarimala ) పేరు చెబితే చాలు అయ్యప్ప భక్తులు భక్తితో పులకరిస్తారు. శబరిమల వెళ్లినవారెవరైనా..అత్యంత ఇష్టంతో తెచ్చుకునేది అరవణ ప్రసాదం. కోవిడ్ మహమ్మారి ( Corona pandemic ) కారణంగా మొన్నటివరకూ ఆలయమే మూతపడింది. ఇటీవల కాలంలో తిరిగి తెర్చుకుంది కానీ కోవిడ్ ఆంక్షల నేపధ్యంలో ఎక్కువ సంఖ్యలో వెళ్లలేని పరిస్థితి. రోజుకు వేయిమందికి మాత్రమే ప్రవేశం. అందుకే భక్తులందరూ వెళ్లలేకపోతున్నారు. 

తిరుపతి ( Tirupati ) లడ్డూకి ఉన్న ప్రాముఖ్యతే శబరిమల ప్రసాదానికి ( Sabarimala prasadam ) ఉంది. అందుకే ఎవరైనా శబరిమల వెళ్తున్నారంటే ప్రసాదం తెప్పించుకుంటుంటారు. ఇప్పుడు వెళ్లేవారే కరువయ్యారు. ఈ సీజన్‌లో లభించే ప్రసాదానికి డిమాండ్ ఎక్కువ. అందుకే శబరిమలకు వెళ్లే భక్తులు ఎక్కువ ప్రసాదాన్నే తెచ్చుకుంటుంటారు. స్నేహితులకు, బంధువులకు ప్రసాదాన్ని పంచుతుంటారు.

కోవిడ్ కారణంగా ఆ పరిస్థితి ఉండటం లేదిప్పుడు. కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా అందరికీ కావల్సినంత ప్రసాదం అందడం లేదు. అందుకే శబరిమల ఆలయం ట్రస్ట్ ట్రావెన్ కోర్ ( Travancore ) ఓ నిర్ణయం తీసుకుంది. పోస్టల్ శాఖతో ఒప్పందం చేసుకుంది. శబరిమల ప్రసాదాన్ని నేరుగా ఇంటికే డెలివరీ చేసే విధంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రసాదం కిట్ విలువ 450 రూపాయలుగా నిర్ణయించారు.

Also read: Ap Assembly live: స్పీకర్‌ను బెదిరించిన చంద్రబాబు..సభలో దుమారం

శబరిమల ప్రసాదం ఎలా తెచ్చుకోవాలి

దీనికి మీరు చేయాల్సింది చాలా సింపుల్ విధానం. మీకు దగ్గరలో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లండి. పోస్టాఫీసులో శబరిమల ప్రసాదం పేరుతో ఓ ఫామ్ ఉంటుంది. అది ఫిల్ చేసి..డబ్బులు చెల్లించేస్తే..వారం రోజుల్లో ఇంటికి ప్రసాదం కిట్ వస్తుంది. ఈ కిట్‌లో అరవణ ప్రసాదంనెయ్యి, విభూతి, అష్టోత్తర అర్చన ప్రసాదం ఉంటాయి. ఎన్ని ప్రసాదం కిట్లు కావలిస్తే..అన్ని ఫామ్‌లు ఫిల్ చేయాల్సి ఉంటుంది.

Also read: Postal Ballot Voting: విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం కొత్త పోస్టల్ విధానం?

Trending News