Driving License: నిత్య జీవితంలో ఓ భాగం డ్రైవింగ్ లైసెన్స్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నియమాలతో ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ కాస్త సులభతరం కానుంది.
ఇప్పుుడు డ్రైవింగ్ లైసెన్సుల కోసం ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియను ప్రభుత్వం ఇప్పుడు సరళీకృతం చేసింది. కొత్త నియమాలను ప్రవేశపెట్టింది. ఫలితంగా లైసెన్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. డ్రైవింగ్ స్కూల్ నుంచే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు.
పూర్తి వివరాల లోకి వెళితే.. లైసెన్స్ కోసం అర్హత సాధించడానికి ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవర్ స్కూల్ కేంద్రాలలో శిక్షణ పొందాలి. మీరు డ్రైవింగ్ స్కూల్ నుండి డ్రైవింగ్ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేస్తే డ్రైవింగ్ టెస్ట్ నుండి మీకు మినహాయింపు ఉంటుంది.
అయితే డ్రైవింగ్ స్కూల్స్ మరియు గుర్తింపు పొందిన ఏజెన్సీలు ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు మరియు తేలికపాటి మోటారు వాహనాల శిక్షణా కేంద్రాలకు మినిమమ్ ఒక ఎకరం భూమి ఉండాలి. అదే భారీ వాహనాలు మరియు కార్గో ట్రక్కుల ట్రైనింగ్ ఇచ్చే స్కూల్స్‌కి అయితే రెండు ఎకరాలు ఉండాలి. అంతే కాక ఎగ్జామినర్ కనీసం 12 తరగతి పాస్ అయ్యి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఫిజికల్ టెస్ట్ ఆన్లైన్లో కూడా హాజరు కావచ్చు. ఆన్లైన్ టెస్ట్ ఆడిట్ కోసం ఎలక్ట్రానికల్‌గా రికార్డు అవుతుంది. డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు సర్టిఫికేట్ ఇచ్చిన తరువాత ఆర్టీవో కార్యాలయాధికారికి చేరుకుంటుంది.
Also read: KTR vs DK: వాళ్లను బ్యాగ్ సర్దేయండన్న కేటీఆర్.. మధ్యలో కర్ణాటక పీసీసీ చీఫ్ జోక్యం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook