నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ వీడియో వంటి విదేశీ సంస్థలకు గట్టి పోటీని ఇస్తూ భారతీయ మీడియా సర్వీస్ ప్రొవైడర్ హాట్‌స్టార్ సంస్థ తాజాగా ఓ సరికొత్త ఆఫర్‌ని ప్రకటించింది. సంవత్సరానికి రూ.365 సబ్స్క్రిప్షన్ ఫీజు కింద హాట్‌స్టార్ అందిస్తున్న విఐపి ప్లాన్ టారిఫ్‌తో ఐపీఎల్ 2019 క్రికెట్ మ్యాచ్‌లు, టీవీ షోలు, సరికొత్త సినిమాలను వీక్షించే వీలుంది. అంతేకాకుండా హాట్ స్టార్ విఐపి సబ్‌స్క్రైబర్స్‌కి స్టార్ నెట్ వర్క్ ఛానెల్స్ ప్రసారం చేసే సీరియల్స్‌ని టీవీలో ప్రసారం అవడానికన్నా ముందే వీక్షించే అవకాశం వుండటం మరో విశేషం. అయితే, హాట్‌స్టార్ స్పెషల్స్ లేబుల్స్ కింద లభ్యమయ్యే వీడియోలు మాత్రమే ఈ హాట్‌స్టార్ విఐపి ప్లాన్ ఆఫర్ పరిధిలోకొస్తాయనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అమెరికాకు చెందిన అన్ని టీవీ షోలు, ఇంటర్నేషనల్ సినిమాలు ఈ ఆఫర్‌కి వర్తించకపోవడం గమనార్హం.
జీ బిజినెస్ వెల్లడించిన ఓ కథనం ప్రకారం వివో ఐపిల్, ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్, ఫార్ములా 1 వంటి ప్రీమియర్ లీగ్స్ అన్నింటిని ఈ హాట్‌స్టార్ విఐపి టారిఫ్ కింద వీక్షించవచ్చు. అది కూడా ఏడాదికి రూ.365కి మాత్రమే. అంటే రోజుకు రూ.1 మాత్రమేనన్నమాట.