Holi 2021 Celebration Ban: హోలీ వేడుకలు నిషేధించిన, ఆంక్షలు విధించిన రాష్ట్రాలు, కండీషన్లు ఇవే

Holi 2021 Celebrations Banned | కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం కేవలం 6 రాష్ట్రాల నుంచే 80 శాతానికి పైగా కరోనా కేసులు వస్తున్నాయి. కరోనా కేసులు నమోదు అవుతుండటంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 29, 2021, 11:07 AM IST
Holi 2021 Celebration Ban: హోలీ వేడుకలు నిషేధించిన, ఆంక్షలు విధించిన రాష్ట్రాలు, కండీషన్లు ఇవే

నేడు దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. గతానికి భిన్నంగా కాస్త భయం భయంగా రంగుల పండుగలో ప్రజలు భాగస్వాములు అవుతున్నారు. మరోవైపు దేశంలో శనివారం నాడు ఏకంగా 62,000 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. ఈ కారణాలతో కొన్ని రాష్ట్రాలు హోలీ వేడుకలపై ఆంక్షలు విధించాయి. 

కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం కేవలం 6 రాష్ట్రాల నుంచే 80 శాతానికి పైగా కరోనా కేసులు వస్తున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ రాష్ట్రాలలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. హోలీ వేడుకలు జరుపుకునేందుకు కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించగా, మరికొన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయిలో హోలీ సంబరాలను నిషేధించడం తెలిసిందే.

Also Read: Holi 2021 Skin Care: హోలీ పండుగతో జర జాగ్రత్త, ఏమేం పాటిస్తూ హోలీ జరుపుకోవాలంటే

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూదని ఆంక్షలు విదించారు. హోలీ వేడుకలు, షాబ్ ఈ బరాత్ వేడుకలు నిర్వహించకూడదని, బహిరంగ స్థలాలు, మార్కెట్లు, మత స్థలాలలో ఏ కార్యక్రమాలు చేపట్టకూదని హెచ్చరించారు.

మహారాష్ట్ర: రాష్ట్రంలో ప్రజలు ఎక్కడా కూడా సమూహంగా గుమికూడరాదని ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్19 నిబంధనలు పాటించాలని సూచించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్‌లో హోలీ వేడుకలు నిషేధించారు.

Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 29, 2021, వారి చేతికి ఆస్తి

హర్యనా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఒడిశా, కర్ణాటక ప్రాంతాల్లోనూ హోలీ వేడుకలపై ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. ఉగాది పండుగతో పాటు గుడ్ ఫ్రైడే లాంటి ఈవెంట్ల రోజున సైతం బహిరంగ ప్రదేశాలలో ప్రజలు గుమికూడకుండా ఉండేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ అధికారులు 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 10 ఏళ్ల లోపు చిన్నారులను సైతం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

Also Read: Gold Price Today 29 March 2021: బులియన్ మార్కెట్‌లో స్థిరంగా బంగారం ధరలు, వెండి ధరలు పైపైకి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News