Religious leader Kalicharan Maharaj arrested: మహాత్మాగాంధీని (Mahatma Gandhi) తూలనాడుతూ నాథురాం గాడ్సేను ప్రశంసిస్తూ ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ మహారాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఇటీవల ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాజధాని రాయ్‌పూర్‌లో నిర్వహించిన 'ధరమ్ సన్సద్' అనే హిందుత్వ కార్యక్రమంలో కాళీచరణ్ మహారాజ్ గాంధీపై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. గాంధీని హత్య చేసిన గాడ్సేకి తాను నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. చెప్పరాని పదజాలంతో గాంధీని సంబోధించారు. కాళీచరణ్ వ్యాఖ్యలపై కేసు నమోదవడంతో రాయ్‌పూర్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
'భారత్ మన కళ్ల ముందే రెండుగా చీలిపోయింది. అప్పటికే ఇరాన్, ఇరాక్, ఆఫ్గనిస్తాన్ భారత్ నుంచి వేరయ్యాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మనం చూస్తుండగానే దేశం నుంచి విడిపోయాయి. రాజకీయంతో దేశాన్ని విభజించారు. ఆ **** మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ దేశాన్ని సర్వనాశనం చేశాడు. అతన్ని చంపిన నాథురాం గాడ్సేకి నమస్కరిస్తున్నాను.' అని కాళీచరణ్ మహారాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు, సమాజంలోని అల్సర్స్‌ని సర్జరీ ద్వారా తొలగించాలని... లేనిపక్షంలో అవి క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉందని గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'నేనేమీ మిమ్మల్ని అల్లర్లకు దిగమని చెప్పట్లేదు. అంత అవసరం కూడా లేదు. పైగా మీరు దానికి సిద్ధంగా లేరు. ముస్లింలు అందుకు సిద్ధంగా ఉన్నారు... మీరు కాదు. ఒకవేళ పోలీసులే గనుక లేకపోయి ఉంటే మనమంతా ఈపాటికే ఫినిష్ అయ్యేవాళ్లం.' అని కాళీ చరణ్ మహారాజ్ పేర్కొన్నారు.
నిజానికి స్వతంత్ర భారతదేశానికి మొదటి ప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్ కావాల్సి ఉందని కాళీచరణ్ పేర్కొన్నారు. నెహ్రూకి బదులు పటేల్ ప్రధాని అయి ఉంటే ప్రపంచంలో అమెరికా కన్నా భారత్ శక్తివంతంగా ఎదిగి ఉండేదని... భారత్ ఒక గోల్డెన్ బర్డ్ అయ్యేదని వ్యాఖ్యానించారు. కాళీచరణ్ వ్యాఖ్యలపై రాయ్‌పూర్‌లోని (Chhattisgarh) తిక్రపారా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మధ్యప్రదేశ్‌లో ఆయన్ను అరెస్ట్ చేశారు.
Warning Abusive content
“महा हरामी वो मोहनदास करमचंद गाँधी ने सत्यानाश पेल दिया।गोडसे जी को नमस्कार है कि मार डाला उस हरामी को”
इस बार ये “अधर्म संसद” कांग्रेस शासित #छत्तीसगढ से है।ये गाली-गलौज करने वाला महाराष्ट्र से आया कोई कालीचरण बताया जा रहा है। @bhupeshbaghel pic.twitter.com/I79kx8G6FY
— Vinod Kapri (@vinodkapri) December 26, 2021
Also Read: Karate Kalyani Latest News: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ కరాటే కల్యాణి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook