CBI Vs Mamata govt: మమత దీక్షతో కోల్‌కతాలో హై టెన్షన్

Last Updated : Feb 4, 2019, 02:52 PM IST
CBI Vs Mamata govt:  మమత దీక్షతో కోల్‌కతాలో హై టెన్షన్

సీసీఐ వర్సెస్ స్టేట్ గవర్నర్ మెంట్ పరిణామాలతో కోల్ కతాలో హైడ్రామా నెలకొంది. చిట్ ఫంట్ స్కాం పేరుతో కోల్ కతా సీపీ రాజీవ్ను విచారించేందుకు  రంగంలోకి దిగిన సీబీఐ అధికారులను మమత సర్కార్ అడ్డుతగిలింది. అనుమతి లేకుండా వచ్చినందుకు సీబీఐ బృందాన్ని స్థానిక పోలీసులు అరెస్ట్ చేయడం..అనంతరం సీఎం మమత తన మంత్రి వర్గ అనుచరులతో రాత్రంతా సీపీ ఇంటి వద్ద జాగరం చేమడం.. మెట్రో స్టేషన్ వద్ద దీక్షకు దిగడం వంటి పరిణామాలతో రాష్ట్రంలో ఉద్రిక్త వావరణం నెలకొంది. 

సీబీఐను అడ్డుకున్న స్థానిక పోలీసులు
చిట్ ఫంట్ స్కాం విషయంలో ఆదివారం  కోల్ కతా సీపీ రాజీవ్ ను విచారించేందుకు వెళ్లిన సీబీఐ బృందానికి అనుకోని విధంగా షాక్ తగిలింది. ఏ అనుమతి తీసుకొని విచారణకు వచ్చారంటూ స్థానిక పోలీసులు నిలదీశారు. ఈ క్రమంలో ఐదుగురు సభ్యుల సీబీఐ బృందాన్ని వారు అరెస్ట్ చేశారు. అయితే కాసేపటి తర్వాత సీబీఐ బృందానికి విడిచిపెట్టారు. 

పోలీసుల తీరుపై సుప్రీంలో సీబీఐ పిటిషన్

కోల్ కతా  పోలీసుల తీరుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు  సీబీఐ పేర్కొంది. రోస్ ర్యాలీ శారద పొంచిజ్ పత్రాల్లో కీలకపత్రాలు మాయమయ్యాయని..ఈ వ్వవహారంపై సీపీని ప్రశ్నించేందుకు ఆయన నివాసానికి  వెళ్లమన్నారు. ఈ క్రమంలో విచారించేందుకు అనుమతి ఉందా అంటూ తమను స్థానిక పోలీసులు ప్రశ్నించారని సీబీఐ పేర్కొంది. ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కోల్ కతాలోని సీబీఐ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో కేంద్ర సీఆర్‌పీఎఫ్ బలగాలను ఉంచారు.

మమతకు బాసటగా నిలిచిన చంద్రబాబు

ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ మోడీ సర్కార్ ఫెడరల్ స్పూర్తిగా విరుద్ధంగా నడుచుకుంటుందని..బెంగాల్ ప్రభుత్వంపై సీబీఐని ఉసిగొల్పుతుందని ఆరోపించారు . కాగా మమత దీక్షకు ఏపీ సీఎం చంద్రబాబు, ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ తో పాటు పలు ప్రాంతీయ పార్టీ నేతలు మద్దతు ప్రకటించారు. మరోవైపు సుప్రీం ఆదేశాల మేరకే సీబీఐ విచారణ చేపడుతుందని బీజేపీ సమర్ధించుకుంది. మోడీ సర్కార్ పై బురదజల్లడం మాని...సీబీఐ విచారణకు సహకరించాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ శాఖ డిమాండ్ చేసింది.

Trending News