వైష్ణోదేవి ఆలయానికి హెలికాఫ్టర్ సేవలు రద్దు

జమ్మూ-కాశ్మీర్ లో మాతా వైష్ణో దేవికి హెలికాప్టర్ సేవలను వరుసగా రెండో రోజైన మంగళవారం కూడా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

Last Updated : Dec 12, 2017, 02:18 PM IST
వైష్ణోదేవి ఆలయానికి హెలికాఫ్టర్ సేవలు రద్దు

శ్రీనగర్ (జమ్మూ&కాశ్మీర్): జమ్మూ-కాశ్మీర్ లో మాతా వైష్ణో దేవికి హెలికాప్టర్ సేవలను వరుసగా రెండో రోజైన మంగళవారం కూడా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ట్రిక్టా హిల్స్ చుట్టూ వాతావరణ పరిస్థితులు, పొగమంచు కారణంగా సేవలను నిలిపివేశారు. 

వైష్ణో దేవి పుణ్య క్షేత్రంలో చేరుకున్న యాత్రికులు, ముఖ్యంగా వృద్ధులు మరియు వికలాంగులు హెలికాఫ్టర్ సేవల రద్దు కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. కత్రాలో వందలాది మంది యాత్రికులు హెలికాఫ్టర్ సేవలను తిరిగి పునరుద్దరించాలని వేచి ఉన్నారు. కాశ్మీర్ డివిజన్ లో లడఖ్ సహా చాలా ప్రదేశాలలో రాత్రి ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గిపోయాయి.

రాజౌరి మరియు శ్రీనగర్లో పిర్ పంజాల్ శ్రేణిలో మంచు కురుస్తోంది. రోడ్లన్నీ మంచుతో కప్పబడ్డాయి. ఈ ప్రాంతంలో మొఘల్ రహదారి మరియు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మంచు కారణంగా మూసేశారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలోని సోలాంగ్ లోయలో కూడా  హిమపాతం వచ్చి చేరింది. డిసెంబరు 11 నుండి ఉత్తర భారత దేశంలో చలితీవ్రత ఉంటుందని  మెట్ డిపార్ట్మెంట్ ముందుగానే ప్రకటించింది.

Trending News