Heavy Rains: ముంబైలో రెడ్ అలెర్ట్

భారీ వర్షాలతో దేశంలోని పలు ప్రాంతాలు ఇప్పటికే అతలాకుతలం అవుతున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, పూనే, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ (IMD) దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెడ్ అలెర్ట్‌ జారీ చేసింది.

Last Updated : Oct 15, 2020, 08:59 AM IST
Heavy Rains: ముంబైలో రెడ్ అలెర్ట్

Heavy rains lash in Mumbai, Pune: IMD issues Red Alert: ముంబై: భారీ వర్షాలతో దేశంలోని పలు ప్రాంతాలు ఇప్పటికే అతలాకుతలం అవుతున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, పూనే, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురవనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ (IMD) దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) లో రెడ్ అలెర్ట్‌ జారీ చేసింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ ఈశాన్య ప్రాంతం నుంచి పశ్చిమ దిశగా కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో మరో ఐదు రోజుల పాటు ఉత్తర కొంకణ్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. Also read: Hyderabad Rains: నగరంలో ఎటుచూసినా నీరే.. హెల్ప్ లైన్ నెంబర్ల జారీ

ఈ మేరకు మహారాష్ట్రలోని ముంబైతోపాటు థానే,పూణే, షోలాపూర్, ఉత్తర కొంకణ్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు గురువారం ఉదయం హెచ్చరిస్తూ రెడ్ అలెర్ట్‌ను జారీ చేశారు. అయితే ఇప్పటికే భారీవర్షాల కారణంగా ముంబై నగరంలోని పలుప్రాంతాలు నీటమునిగాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అవసరమైతేనే తప్ప బయటకు రావొద్దంటూ ప్రజలు సూచించింది. ఇదిలాఉంటే.. గురువారం ఉదయం నుంచే పలుప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను ప్రారంభించారు. పూణే జిల్లా నింగాన్ కేట్కీ గ్రామంలో వరదనీటిలో చిక్కుకున్న ప్రజలను కాపాడారు. Also read: Kishan Reddy: అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

ముంబైలో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దంటూ బీఎంసీ అధికారులు కోరారు. మహానగరంలో ఇప్పటికే పలుప్రాంతాలు నీటమునగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.  Also read: Hyderabad Rains: 15కు చేరిన మరణాల సంఖ్య.. కొనసాగుతున్న రెస్క్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News