Unlock 3.0 guidelines: అన్‌లాక్ 3.0లో అందుబాటులో ఉండేవి.. లేనివి జాబితా

కరోనావైరస్ వ్యాప్తి నివారణ కోసం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలను దశల వారీగా సడలిస్తున్న కేంద్రం.. తాజాగా అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు ( Unlock 3 guidelines ) విడుదల చేసింది.

Last Updated : Jul 30, 2020, 12:41 AM IST
Unlock 3.0 guidelines: అన్‌లాక్ 3.0లో అందుబాటులో ఉండేవి.. లేనివి జాబితా

న్యూఢిలీ​ : కరోనావైరస్‌ ( Coronavirus) వ్యాప్తి నివారణ కోసం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలను దశల వారీగా సడలిస్తున్న కేంద్రం.. తాజాగా అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు ( Unlock 3 guidelines ) విడుదల చేసింది. జూలై 31తో అన్‌లాక్‌ 2.0 గడువు ముగియనున్న నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ తాజాగా అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాల ప్రకారం కంటైన్‌మెంట్‌ జోన్లలో ఆగస్టు 31వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టంచేసిన కేంద్రం.. రాత్రి కర్ఫ్యూను ( Night curfew) మాత్రం ఎత్తేస్తున్నట్టు తేల్చిచెప్పింది. Also readSS Rajamouli: రాజమౌళికి కరోనా పాజిటివ్

Unlock 3.0 guidelines మార్గదర్శకాలు..
కంటైన్‌మెంట్‌ జోన్లలో ఆంక్షలు యధాతథం.
ఆగస్టు 31 వరకు అన్ని విద్యా సంస్థలతో పాటు కోచింగ్‌ సెంటర్లు మూసివేత
ఆగస్టు 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్‌లకు అనుమతి
పరిస్థితులను బట్టి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సినిమా థియేటర్స్, స్విమ్మింగ్‌ పూల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, మెట్రో రైలు‌ మూసివేత కొనసాగింపు 
సాధారణ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం అమలులో ఉంటుంది.
సామాజిక, రాజకీయ, వినోద, మత పరమైన సమావేశాలపై నిషేధం అమలులో ఉంటుంది. 
భౌతిక దూరం, కొవిడ్-19 నిబంధనలతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అనుమతి. Also read: Smoking vs COVID-19: సిగరెట్ తాగే అలవాటుందా ? ఐతే కరోనాతో కష్టమే!

Trending News