Gyanvapi masjid Issue: వివాదాస్పద జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వారణాసి కోర్టు విచారణను నిలుపుదల చేసింది. సుప్రీంకోర్టు తీర్పులో కీలకాంశాలు ఇలా ఉన్నాయి..
ఉత్తరప్రదేశ్ వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఇక నుంచి విచారణ తామే చేపడతామని తేల్చి చెప్పింది. అదే సమయంలో వారణాసి కోర్టు చేస్తున్న విచారణను నిలిపివేసింది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం మద్యాహ్నం అంటే మే 20 న విచారణ చేపట్టనుంది.
జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై వారణాసి కోర్టు ఆదేశాల మేరకు సర్వే, వీడియోగ్రఫీ మూడ్రోజులపాటు నడిచింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లపై విచారణ సందర్బంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక నుంచి ఈ వ్యవహారంపై తామే విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారణాసి కోర్టు చేస్తున్న విచారణపై స్టే విధించింది. అదే సమయంలో సర్వే నివేదిక అంశాల్ని బయటపెట్టవద్దని ఆదేశించింది. సుప్రీంకోర్టులో రేపు విచారణ ప్రారంభం కానుంది.
సర్వే సందర్భంగా శివలింగం బయటపడిందంటూ వార్తలు వెలువడ్డాయి. అది శివలింగం కాదు. ఫౌంటెయిన్ అని ముస్లిం పక్షాలు వాదించాయి. మరోవైపు ఈ ప్రాంతాన్ని వారణాసి జిల్లా అధికారులు సీజ్ చేశారు. జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి పలు పిటీషన్లపై వారణాసి కోర్టులో జరగాల్సిన విచారణ కూడా న్యాయవాదుల సమ్మె కారణంగా వాయిదా పడింది.
Also read: Supreme Court on GST: జీఎస్టీపై భారత సర్వోన్నత న్యాయ స్థానం కీలక తీర్పు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook