రూ.7000 కోట్లతో 18 బుల్లెట్ రైళ్ల కొనుగోలుకు కేంద్రం సిద్ధం!

భారత్‌లో పరుగులు పెట్టనున్న తొలి బుల్లెట్ రైలు ఇదే..

Last Updated : Sep 5, 2018, 03:00 PM IST
రూ.7000 కోట్లతో 18 బుల్లెట్ రైళ్ల కొనుగోలుకు కేంద్రం సిద్ధం!

జపాన్ నుంచి 18 బుల్లెట్ రైళ్లను భారత ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తోంది. ఇందుకోసం 7,000 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. భారత దేశంలో వీటిని తయారు చేయడానికి జపాన్ టెక్నాలజీని అందజేస్తుందని ఎకనమిక్ టైమ్స్ వెల్లడించింది.

జపాన్ నుండి 18 షిన్‌కాన్‌సేన్ రైళ్లను త్వరలో భారత్‌కు వస్తున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి పేర్కొన్నారు. ప్రతి రైలులో 10 బోగీలు ఉంటాయని, ఇవి గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని ఆ అధికారి చెప్పారు. ఈ హై స్పీడ్ రైళ్లను కొనడానికి త్వరలో టెండర్లను పిలుస్తారని, అందులో జపాన్ తయారీదారులు కూడా పాల్గొంటారని.. వారు అచ్చం జపాన్‌లో ఉన్నట్లు.. మన దేశంలో కూడా బుల్లెట్ రైళ్లకు సంబంధించిన అసెంబ్లీ యూనిట్ల డిజైన్‌ల ఏర్పాటు గురించి వివరించనున్నారని అన్నారు.  

జపాన్‌లో తయారయ్యే ఈ రైళ్లు ప్రపంచంలోనే అత్యంత ఉన్నత భద్రతా ప్రమాణాలు కలిగి ఉంటాయట. బుల్లెట్ రైళ్ల తయారీకి ప్రభుత్వ-ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో రైళ్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తారు.

2022 నాటికి ముంబయి, అహ్మదాబాద్‌ల మధ్య మొదటి బుల్లెట్ రైలును నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే జరిగితే ఇండియన్ రైల్వేలో పరుగులు పెట్టనున్న తొలి బుల్లెట్ రైలుగా ఈ రైలు చరిత్ర సృష్టించనుంది. జపాన్ సహాయంతో నిర్మించిన 508 కిలోమీటర్ల హై స్పీడ్ రైలు కారిడార్ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు 3 గంటలు తగ్గిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం 825 హెక్టార్ల భూమి అవసరం. డిసెంబరు 2018 డిసెంబరు నాటికి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం అవసరమైన భూమిని కొనుగోలు చేసి.. నిర్మాణ పనులను జనవరి 2019లో ప్రారంభించాలని భారతీయ రైల్వే భావిస్తోంది.

ట్రైన్ ప్రారంభంలో, 750 మంది ప్రయాణీకుల సీటింగ్ సామర్థ్యంతో 10 కోచ్‌లను కలిగి ఉంటుందని.. తర్వాత 1,250 ప్రయాణికుల సీటింగ్ సామర్ధ్యంతో 16 కోచ్‌లను కలిగి ఉంటుందట. ఎకానమీ క్లాసు చార్జీయే దాదాపు రూ.3,000 ఉంటుందని సమాచారం. ఈ రైలులోని ఫస్ట్ క్లాస్ కోచుల్లో విమానాల్లో ఉండే సదుపాయాలు ఉంటాయట.

ప్రారంభ రోజులలో, ఏటా బుల్లెట్ రైళ్లలో సుమారు 1.6 కోట్ల మంది ప్రయాణించవచ్చని.. 2050 నాటికి 1.6 లక్షల మంది రోజూ ఈ హై స్పీడ్ రైళ్లలో ప్రయాణిస్తారని నివేదికలు పేర్కొన్నాయి.

 

Trending News