న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న గురువారం రూ.150 పెరిగి రూ.32,000 వద్ద ట్రేడ్ అయిన తులం బంగారం ఇవాళ రూ.230 పెరిగి రూ.32,230కి చేరింది. దేశంలో జువెలరీ వ్యాపారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటమే ఈ ధరల పెంపునకు కారణమైందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. బులియన్ మార్కెట్‌లో నిన్న గురువారం రూ.130 తగ్గి రూ.37,750 పలికిన కిలో వెండి ఇవాళ రూ.250 పెరిగి రూ.38,000లకు చేరుకుంది. నాణేల తయారీదారులతోపాటు పరిశ్రమవర్గాల నుంచి డిమాండ్ పెరగడమే వెండి ధర పెరగడానికి కారణమైందని మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి.