నిన్న తగ్గిన బంగారం ధర.. ఇవాళ మళ్లీ పెరిగింది

తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరిగిన బంగారం ధర

Last Updated : Dec 21, 2018, 08:13 PM IST
నిన్న తగ్గిన బంగారం ధర.. ఇవాళ మళ్లీ పెరిగింది

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్‌లో బుధవారం రూ.210 తగ్గిన బంగారం ధర ఇవాళ మరోసారి స్వల్ప మోతాదులో పెరిగి పైకి ఎగబాకింది. దేశ రాజధాని ఢిల్లీలో ట్రేడ్ అయిన లావాదేవీల ప్రకారం 99.9% శుద్ధమైన మేలిమి బంగారం ధర రూ.150 పెరిగి 10 గ్రాములకు రూ.32,000 రౌండ్ ఫిగర్‌కి చేరుకోగా.. 99.5% శుద్ధమైన మేలిమి బంగారం ధర సైతం రూ.150 పెరిగి 10 గ్రాములకు రూ.31,850 కి చేరుకుంది. తాజాగా దేశీ జువెల్లర్స్ బంగారం కొనుగోళ్లపై ఆసక్తి కనబరుస్తుండటమే బంగారం ధరల్లో పెరుగుదలకు కారణమైందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నట్టుగా లైవ్ మింట్ పేర్కొంది. 

ఇదిలావుంటే, మరోవైపు వెండి ధర స్వల్పంగా తగ్గి కిలో రూ.37,750కి చేరుకుంది. వెండి ధరల్లో రూ.130 తగ్గుదల నమోదైంది.

Trending News