నేటి బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో నిన్న సాయంత్రం దిగొచ్చిన బంగారం, వెండి ధరలు నేడు అతి స్వల్పంగా పెరిగాయి. జూన్ మొదటి వారంలో రికార్డు ధరలు నమోదు చేసిన బంగారం, వెండి ఆపై తగ్గుముఖం పట్టింది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 17, 2020, 08:01 AM IST
నేటి బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today) అతి స్వల్పంగా పెరిగాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. హైదరాబాద్‌ (Gold Price In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో నిన్న సాయంత్రం రూ.210 మేర బంగారం ధర దిగిరాగా, నేడు రూ.10 మేర అతి స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,4600కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,330 వద్ద ట్రేడ్ అవుతోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంట మరో విషాదం

ఢిల్లీలో నిన్న సాయంత్రం రూ.260 తగ్గిన బంగారం ధర నేటి మార్కెట్‌లో రూ.10 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,210కి వచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,010కి పెరిగింది. కొత్తిమీర అని తీసి పారేయొద్దు.. ఈ ప్రయోజనాలు తెలుసా!

బులియన్ మార్కెట్‌లో జూన్ తొలి వారంలో ఆల్ టైమ్ రికార్డు ధరలు నమోదు చేసిన వెండి ధరలు ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. నిన్న మార్కెట్‌లో రూ.610 మేర తగ్గిన వెండి ధర నేడు అతి స్వల్పంగా రూ.10 మేర పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.47,110 వద్ద ట్రేడ్ అవుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ

 

Trending News