Goat with Human Face: మనిషిని పోలిన జంతువుకు జన్మనిచ్చిన మేక.. చూసేందుకు ఎగబడ్డ జనం!!

Goat with Human Face: ఓ మేక మనిషిని పోలీన ఆకారంతో ఉన్న జీవికి జన్మనిచ్చింది. ఈ ఘటన అస్సాంలోని ధోలాయ్ విధానసభ నియోజకవర్గంలో తాజాగా జరిగింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 01:06 PM IST
  • మేక కడుపున వింత జీవి
  • మనిషిని పోలిన జంతువుకు జన్మనిచ్చిన మేక
  • మనిషిని పోలిన ఆకారంతో మేక
Goat with Human Face: మనిషిని పోలిన జంతువుకు జన్మనిచ్చిన మేక.. చూసేందుకు ఎగబడ్డ జనం!!

Goat gives birth to baby with Man face in Assam: ప్రపంచంలో ఎన్నో అద్బుతాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు ఎన్నో వింతలు, విశేషాలు చోటు చేసుకుంటుంటాయి. అందులో కొన్ని చిత్రవిచిత్రమైన రీతిలో, ఎవరూ నమ్మలేని వింతలు జరుగుతుంటాయి. ఈ భూమి మీద నివసించే జంతువులు ఒక్కోసారి వింత జీవాలకు జన్మనిస్తుంటాయి. వాటిని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి ఘటనే తాజాగా జరిగింది. ఓ మేక (Goat) మనిషి (Man)ని పోలీన ఆకారంతో ఉన్న జీవికి జన్మనిచ్చింది. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే... 

అస్సాం (Assam)లోని ధోలాయ్ విధానసభ నియోజకవర్గంలోని గంగాపూర్ గ్రామంలో శంకర్ దాస్ అనే వ్యక్తి మేకలను పెంచుకుంటున్నాడు. తన మందలోని ఓ మేక వింత జీవికి జన్మనిచ్చింది. ఆ జీవి మనిషి ఆకారాన్ని (Goat with Human Face) పోలి ఉంది. పూర్తిగా తెలుపు రంగులో ఉండి.. శరీరంపై వెంట్రుకలు లేకుండా పుట్టింది. ఆ జీవి తల భాగం పూర్తిగా మనిషి ఆకారాన్ని పోలి ఉండగా.. కింది భాగం మాత్రం అభివృద్ధి చెందలేదు. ఆ జీవి కళ్లు, ముక్కు, నోరు మనిషిని పోలి ఉన్నాయి. అయితే చెవులు మాత్రం మేకలా ఉన్నాయి. దానికి తోక లేదు. అయితే ఆ జీవి పుట్టగానే మరణించింది.

Also Read: LPG Cylinder Price: సామాన్య ప్రజలకు భారీ షాక్.. జనవరి 1న గ్యాస్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం!!

మనిషి ఆకారాన్ని పోలి ఉన్న జీవి మేకకు పుట్టిందన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు, ఇరుగుపొరుగు గ్రామాల ప్రజలు దానిని చూసేందుకు బారులు కట్టారు. కొందరు ఆ వింత జీవి పోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ మేక ఆరోగ్యంగా ఉన్న మరొక బుజ్జి మేకకు కూడా జన్మనిచ్చిందట. బుజ్జి మేక ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉందని సెంటినెల్ అస్సాం పేర్కొంది. ఎలాంటి ఘటనలు ఇటీవల చాలానే చోటుచేసుకున్నాయి. వింత ఆకారంలో పుట్టిన ఏ జంతువు కూడా 10 నిమిషాల కంటే ఎక్కువగా బ్రతకలేదు. 

Also Read: David Warner: రిటైర్ అయ్యేలోపు టీమిండియాను ఓడించాలి.. అవకాశం వస్తే చరిత్ర సృష్టించాలి: వార్నర్

ఈ ఏడాది ఆరంభంలో ఇండోనేసియాకు చెందిన ఓ జాలరికి మనిషి మొహంతో ఉన్న షార్క్ పిల్ల దొరికింది. దానిని కోయగా.. లోపల మూడు పిల్లలు ఉన్నాయి. రెండు తల్లిలాగానే ఉండగా.. మూడోది మాత్రం మనిషిలా కనిపించింది. ఈ వార్త అప్పట్లో వైరల్ అయింది. ఏప్రిల్‌లో గుజరాత్‌లో మనిషిని పోలిన ముఖంతో జన్మించిన ఓ మేక పుట్టిన కొద్ది నిమిషాలకే చనిపోయింది. ఇక జులైలో పశ్చిమ బెంగాల్‌లో ఓ మేక ఎనిమిది కాళ్లు, రెండు నడుములు ఉన్న మేకకు జన్మనిచ్చింది. ఈ మేక పిల్లలనుఅక్కడి ప్రజలు దేవుడిలా పూజించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News