Massive Flood In Dhauliganga: వరదలకు కేంద్ర బిందువుగా నిలిచే ఉత్తరాఖండ్‌లో మరోసారి విషాదం చోటుచేసుకుంది. చమోలీ జిల్లాలో ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి. తద్వారా గంగా నది ఉపనది అయిన ధౌలి గంగానది ఒక్కసారిగా ఉప్పొంగుతూ ప్రవహించింది. ఈ వరద ప్రభావంతో ఓ పవర్ ప్రాజెక్టు సైతం పూర్తిగా కొట్టుకుపోయింది.
ధౌలి గంగానది ప్రవాహంలో పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న దాదాపు 150 మంది కార్మికులు గల్లంతయ్యారని, అందులో 10 మృతదేహాలను గుర్తించినట్లు ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీసు(ITBP) అధికారులు వెల్లడించారు. ప్రవాహం ప్రాంతంలో, రేనీ తపోవన్ వద్ద ఉన్న రుషిగంగా అనే పవర్ ప్రాజెక్టుతో సహో దెబ్బతిన్న మరో మూడు వంతెనల వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read: IRCTCలో సరికొత్తగా Bus Tickets బుకింగ్ సౌకర్యం, 22 రాష్ట్రాల్లో ప్రయాణికులకు సేవలు
#WATCH | Water level in Dhauliganga river rises suddenly following avalanche near a power project at Raini village in Tapovan area of Chamoli district. #Uttarakhand pic.twitter.com/syiokujhns
— ANI (@ANI) February 7, 2021
కొండ చరియ ప్రాంతాల్లో ఒక్కసారి ఉత్పాతం సంభవించడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం, పోలీసు శాఖ అప్రమత్తమయ్యాయి. పౌరీ, తెహ్రీ, రుద్ర ప్రయాగ్, హరిద్వార్, డెహ్రాడూన్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి ప్రజలను, అధికారులను అప్రమత్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, ఐటీబీపీ టీమ్స్ వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
Rescue operation underway at the tunnel near Tapovan dam in Chamoli to rescue trapped people. #Uttarakhand
(Pic courtesy: Indian Army) pic.twitter.com/lcKlHdcNn3
— ANI (@ANI) February 7, 2021
కొండ చరియలు విరిగిపడటంతో ధౌలి గంగానది ప్రవాహంలో 150 మందికి పైగా గల్లంతు కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌తో మాట్లాడారు. బాధితులకు తక్షణమే సాయం అందేలా చూడాలని, గల్లంతైన వారిని సాధ్యమైనంత త్వరగా గుర్తించాలని ఆదేశించారు.
Also Read: IBPS క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్ 2021 కోసం క్లిక్ చేయండి, Resul డైరెక్ట్ లింక్ మీకోసం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook