Ginger Price hike: చుక్కలు చూపిస్తున్న అల్లం ధర.. కిలో రూ.400.. ఎక్కడంటే?

Ginger Price hike: టమాటా బాటలోనే పయనిస్తోంది అల్లం. దేశంలో అల్లం ధరలకు రెక్కలు వచ్చాయి. కర్ణాటకలో అయితే కిలో అల్లం రూ. 400 వరకు పలుకుతోంది. దీంతో సామాన్య జనం గగ్గోలు పెడుతున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 22, 2023, 08:01 AM IST
Ginger Price hike: చుక్కలు చూపిస్తున్న అల్లం ధర.. కిలో రూ.400.. ఎక్కడంటే?

Ginger Price hike: దేశంలో కూరగాయల ధరలు ఆకాశాన్నింటుతున్నాయి. ఇప్పటి వరకు టమాటా ధరలు చుక్కలు చూపిస్తే.. తాజాగా  అల్లం ధర కూడా మండిపోతుంది. దీంతో సామాన్యుడు కొనలేని దుస్థితి ఏర్పడింది. అల్లం ధర ఒక్కో చోట ఒక్కోలా ఉంది. కొన్ని చోట్ల కిలో రూ.300 పలికితే మరో చోట రూ.400 వరకు అమ్ముతారు. కర్ణాటక రాష్ట్రంలో అయితే నాలుగు వందల వరకు వెచ్చించాల్సిందే. దీంతో నాన్ వెజ్ తినేవారి బడ్జెట్ పెరిగేపోయే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా అల్లం ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న కర్ణాటకలోనే ఇదే పరిస్థితి ఉంటే మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. రానున్న రోజుల్లో జింజర్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. 

ప్రస్తుతం కర్ణాటకలోని పలు రిటైల్ మార్కెట్ ల్లో కిలో  అల్లం రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. ఆ రాష్ట్రంలో 60 కిలోల అల్లం బస్తా రూ.11 వేలకు అమ్ముతున్నారు. గతేడాది వరకు దీని ధర రూ.2 వేల నుంచి 3వేల రూపాయల మధ్య ఉండేది. హోల్‌సేల్ మార్కెట్‌లో ధరల పెరగడం వల్ల రిటైల్ మార్కెట్‌లో కూడా ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరల పెరుగుదల ముఖ్యంగా మైసూరు, మల్నాడు జిల్లాల రైతులకు వరంగా మారుతోంది. ఇక్కడ రైతులు భారీ మెుత్తం అల్లంను సాగుచేస్తారు. వీరు జింజర్ ను విక్రయించడం ద్వారా పెద్ద మెుత్తంలో లాభాలను ఆర్జిస్తున్నారు. గత దశాబ్ధ కాలంలో అల్లం ధరలు ఈస్థాయిలో పెరగడం ఎప్పుడూ లేదన్నారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడే అవకాశం కూడా ఉంది. 

Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. భారీ నుండి అతి భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News