భారత శ్రీమంతుల్లో అంబానీదే అగ్రస్థానం

భారత్‌లో టాప్-10 శ్రీమంతులు వీరే..

Last Updated : Sep 26, 2018, 09:20 AM IST
భారత శ్రీమంతుల్లో అంబానీదే అగ్రస్థానం

దేశంలో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీకి మళ్లీ అగ్రస్థానం దక్కింది. ఈ ఏడాది దేశంలో రూ.వెయ్యి కోట్ల కన్నా ఎక్కువ సంపాదించిన ధనవంతుల జాబితాను బార్‌క్లేస్‌- హ్యూరూన్‌ ఇండియా సంస్థ వెల్లడించింది. రూ.3.71లక్షల కోట్లతో వరుసగా సంపన్నుల జాబితాలో ఏడో ఏడాది కూడా ముకేశ్‌ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. హిందుజా గ్రూప్‌ రూ.1.59 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక లక్ష్మీ మిట్టల్ రూ.1.14 లక్షల కోట్లతో మూడోస్థానంలో, రూ.96,100 కోట్లతో అజీమ్ ప్రేమ్ జీ తదుపరి స్థానాల్లో నిలిచారు.  

గత ఏడాది కాలంలో ముకేశ్ రోజుకు రూ.300 కోట్లు సంపాదించారని నివేదిక తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ 45 శాతానికిపైగా పుంజుకోవడం ముకేశ్ అంబానీ సంపదను అమాంతం పెరిగిందని బార్‌క్లేస్‌- హ్యూరూన్‌ ఇండియా సంస్థ అభిప్రాయపడింది.

టాప్-10లో చోటు దక్కించుకున్నది వీరే.. !

  • 10.షాపూర్ పల్లోంజీ మిస్త్రీ -రూ.69,400 కోట్లు
  • 9. సైరస్ పల్లోంజీ మిస్త్రీ -రూ.69,400 కోట్లు
  • 8.గౌతమ్ అదానీ కుటుంబం -రూ.71,200 కోట్లు
  • 7. సైరస్ పూనవాలా -రూ.73,000 కోట్లు
  • 6. ఉదయ్ కొటక్ -రూ.78,600 కోట్లు
  • 5. దిలీప్ సంఘ్వీ-రూ.89,700 కోట్లు
  • 4. అజీమ్ ప్రేమ్ జీ- రూ.96,100 కోట్లు
  • 3. లక్ష్మీ మిట్టల్ - రూ.1,14,500 కోట్లు
  • 2. హిందుజా గ్రూప్‌ - రూ.1,59,000 కోట్లు
  • 1. ముకేశ్‌ అంబానీ-రూ.3,71,000 కోట్లు

Trending News