Free Wifi in Indian Railway Stations: భారతీయ రైల్వే మరో మైలు రాయిని చేరుకుంది. దేశవ్యాప్తంగా 6100 రైల్వే స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉబర్ని రైల్వే స్టేషన్‌లో తాజాగా వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ మైలురాయిని చేరుకుంది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్ టెల్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉన్న 6100 రైల్వే స్టేషన్లలో 5000కి పైగా రైల్వే స్టేషన్లు గ్రామీణ పరిధిలోనే ఉన్నాయి. ఇందులో ఈశాన్య రాష్ట్రంలోని మారుమూల స్టేషన్లతో పాటు జమ్మూకశ్మీర్ వ్యాలీలోని 15 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వేస్టేషన్లలో ఇప్పటికే 100 శాతానికి చేరువగా వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని రైల్‌టెల్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం రైల్‌వేర్ పేరుతో రైల్‌టెల్ వైఫై సేవలను అందిస్తోంది.
రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై ఎలా కనెక్ట్ చేసుకోవాలి :
1) స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీ యూజర్ రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను ఉపయోగించుకోవచ్చు.
2) మొదట ఫోన్‌లో వైఫై ఆప్షన్‌ని ఆన్ చేసి 'రైల్‌వైర్' పేరిట ఉన్న కనెక్షన్‌ని ఎంపిక చేసుకోవాలి.
3) ఆ వెంటనే రైల్వే పోర్టల్‌కి అది రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీ మొబైల్ నంబర్‌తో పాటు ఓటీపీ వివరాలను నమోదు చేయాలి. అంతే.. మీ ఫోన్‌లో వైఫై కనెక్ట్ అవుతుంది.
4) ఒకసారి వైఫై కనెక్ట్ అయ్యాక 30 నిమిషాల పాటు ఆ సేవలను ఉపయోగించుకోవచ్చు.
5) ప్రతీరోజూ 1ఎంబీపీఎస్ స్పీడ్‌తో 30 నిమిషాల పాటు ఉచిత వైఫై సేవలు పొందవచ్చు.
6) 30నిమిషాల తర్వాత వైఫై సేవలు పొందాలంటే కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రూ.10తో ఒకరోజు వాలిడిటీతో కూడిన 5జీబీ డేటా పొందవచ్చు. అలాగే, రూ.75తో 30 రోజుల వాలిడిటీతో కూడిన 60 జీబీ డేటా పొందవచ్చు.
Also Read: Virat Kohli Join RCB: ఇన్ని సంవత్సరాలు ఐపీఎల్ ఆడుతానని అనుకోలేదు: కోహ్లీ
Also Read: IPL 2022: ఐపీఎల్ 2022 టైటిల్ పోరుకు సిద్ధమౌతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్రోబబుల్ లెవెన్‌లో ఎవరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook