1 Nation- 1 Election: 5 రాష్ట్రాల ఎన్నికల ఏఫెక్ట్.. మళ్లీ తెరపైకి వన్ నేషన్.. వన్ ఎలక్షన్

జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కారణంగా మరోసారి వన్ నేషన్- వన్ ఎలక్షన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నా.. ఎలక్షన్ కమీషన్ కూడా సుముఖత తెలియజేయడంతో మళ్లీ ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2022, 01:27 PM IST
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో తెరపైకి వన్ నేషన్ - వన్ ఎలక్షన్
  • కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పద్ధతిపై సుముఖత చూపిస్తుంది
  • ఎలక్షన్ కమీషన్ కూడా దీనిపై సుముఖత చూపటం ప్రాధాన్యత సంతరించుకుంది
1 Nation- 1 Election: 5 రాష్ట్రాల ఎన్నికల ఏఫెక్ట్.. మళ్లీ తెరపైకి వన్ నేషన్.. వన్ ఎలక్షన్

1 Nation- 1 Election: దేశంలో ప్రస్తుతం వన్ నేషన్- వన్ కార్డు.. వన్ నేషన్- వన్ ట్సాక్స్ విధానం నడుస్తోంది. వన్ నేషన్- వన్ ఎలక్షన్ పై కూడా చాలా రోజులుగా చర్చ సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలుసార్లు వన్ నేషన్-వన్ ఎలక్షన్ గురించి మాట్లాడారు. కానీ ఎందుకో ఆ ప్రకియ ముందుకు సాగలేదు. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ వన్ నేషన్- వన్ ఎలక్షన్ నినాదం తెరపైకి వచ్చింది. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సుశీల్‌ చంద్రే దీనిపై మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం మీడియాతో మాట్లాడిన సుశీల్‌ చంద్ర.. వన్ నేషన్-వన్ ఎలక్షన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. వన్  నేషన్ వన్ ఎలక్షన్ స్వాగతించదగ్గ సూచన అన్నారు. అయితే దీనికి రాజ్యాంగంలో మార్పు అవసమన్నారు. అంతే కాదు చట్టసవరణ సాధ్యమైతే  అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని అన్నారు. ఐదేళ్లకు ఒకసారి దేశమంతా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. 

జమిలి ఎన్నికలు జరపాలనే వాదన 1983లోనే వచ్చింది. ఏకకాలంలో ఎన్నికలు జరిపితే మంచిదని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. 1999లో జస్టిస్‌ జీవన్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన 'లా' కమిషన్‌ కూడా లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలకు ఎన్నికలు జరపాలని తన నివేదికలో పేర్కొంది. ఆ తర్వాత ఎవరూ దాని ఊసెత్తలేదు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ జమిలి ఎన్నికల అంశం తెరమీదకు వచ్చింది. దేశమంతా ఒకే సారి ఎన్నికలు నిర్వహించేందుకుకు ఎన్నిక సంఘం సిద్దంగా ఉందని సీఈసీ చెప్పడం ద్వారా.. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందా  అనే ప్రశ్న తలెత్తుతోంది. మోడీ సర్కార్  వన్ నేషన్- వన్ ఎలక్షన్ దిశగా ఫోకస్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. నిజానికి బీజేపీ ప్రభుత్వం వన్ ఎలక్షన్ విధానంపై మొదటి నుంచి ఆసక్తిగా ఉంది. ప్రధాని మోడీ పలు సార్లు దీనిపై మాట్లాడారు. దేశమంతా వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌- వన్‌ ఓటర్‌ లిస్ట్ ఉండాలని గతంలో మోడీ కామెంట్ చేశారు. లేకపోతే ఏడాది పొడవునా ఎక్కడో చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని, తద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతున్నదని చెప్పారు. ప్రధాని మోదీయే కాదు రాజకీయ నిపుణులు, మేథావి వర్గాల అభిప్రాయం కూడా ఇలానే ఉంది. దేశంలో ఎప్పుడు ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల వేళ కొన్ని నెలల పాటు కోడ్ అమలులో ఉంటుంది. దీంతో అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. అదే లోక్‌సభకు, దేశంలోని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఈ ప్రాబ్లమ్‌ ఉండదు. అయిదేళ్ల పాటు ఎన్నికల ఊసు ఉండదు. దీనివల్ల ఖర్చు బాగా తగ్గుతుంది.

ఇక వన్ నేషన్- వన్ ఎలక్షన్ సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే పలు మార్లు చర్చ జరిగింది. జరపడం పెద్ద సమస్య కాదనే వారు ఉన్నారు. అసాధ్యమనే వారూ ఉన్నారు. సాధ్యాసాధ్యాలపై కేంద్రం రకరకాల చర్చలు జరిపింది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకుంది. అయితే వన్ నేషన్- వన్ ఎలక్షన్ కు సంబంధించి పలు సమస్యలు కూడా ఉన్నాయి. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు అంగీకరించాలి. బీజేపీ పాలిత రాష్ట్రాలు మోడీ సర్కార్ సూచనకు ఓకే చెప్పొచ్చు. కాని బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు అంగీకరించడమే కష్టమే. అంతేకాదు ఇందుకోసం కొన్ని రాష్ట్రాల ఎన్నికలను ముందుకు జరపాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల ఎన్నికలను పొడగించాల్సి ఉంటుంది. ఇక సాధారణ మెజారిటీ వచ్చిన రాష్ట్రాలలో ప్రభుత్వాలు స్థిరంగా ఉంటాయన్న నమ్మకం లేదు. ఆ  ప్రభుత్వాలు కూలిపోవన్న గ్యారంటీ లేదు. ఫిరాయింపు చట్టంలో ఉన్న లొసుగుల ఆధారంగా నేతలు ఈజీగా పార్టీ మార్చేస్తున్నారు నేతలు. ప్రభుత్వాలు కూలిపోతున్నాయి.అలాంటి పరిస్థితి వస్తే మళ్లీ ఎన్నికలు జరపాల్సిందే. మరీ ఇలాంటి సందర్భాలలో ఎన్నికలు జరుపుతారా? లేక మళ్లీ లోక్‌సభ ఎన్నికలు వచ్చేంత వరకు ఆగుతారా? అప్పటి వరకు పాలన అధికారుల చేతుల్లో ఉంటుందా? ఆ రాష్ట్రంలో పాలన బాధ్యతను కేంద్రం తీసుకుంటుందా? ఇలాంటి సందేహాలన్నీ వస్తున్నాయి. వీటికి ఎవరి దగ్గరా స్పష్టమైన సమాధానాలు లేవు.

మన దేశంలో మొదటి సారి 1951-52లో సాధారణ ఎన్నికలు జరిగాయి. అప్పుడు లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1957, 1962, 19678లో కూడా ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1968-69 మధ్య కాలంలో కొన్ని రాష్ట్రాలలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అప్పటి నుంచి ఒకేసారి ఎన్నిక విధానానికి బ్రేక్ పడింది.

Also Read: Telangana CM KCR: సీఎం కేసీఆర్‌కు వైద్య ప‌రీక్ష‌లు.. వ్యక్తిగత డాక్టర్ ఏం చెప్పారంటే?!!

Also Read: iPhone SE 2022 Bookings: ఐఫోన్​ 2022 ప్రీ బుకింగ్స్ నేటి నుంచే.. పూర్తి వివరాలివే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News