క్వారంటైన్‌లో తబ్లీగీ జమాత్ సభ్యుల 'గలీజు' పనులు

'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా గజగజా వణికిస్తోంది. దీంతో ప్రపంచ దేశాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.

Last Updated : Apr 7, 2020, 01:42 PM IST
క్వారంటైన్‌లో తబ్లీగీ  జమాత్ సభ్యుల 'గలీజు' పనులు

'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా గజగజా వణికిస్తోంది. దీంతో ప్రపంచ దేశాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.

కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే తప్పనిసరిగా నిబంధనలు  పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జనం ఇళ్ల నుంచి  బయటకు వచ్చిన సమయంలో విధిగా మాస్కులు ధరిస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన వారు బహిరంగంగా తుమ్మినా, దగ్గినా , ఉమ్మి వేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేసే పరిస్థితి నెలకొంది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పష్టమైన ప్రకటనలు చేశాయి. 

మరోవైపు  తబ్లీగీ జమాతే సభ్యుల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భవనంలో వేలాది మంది మత ప్రార్థనల పేరుతో సమావేశమై.. ఒకరి నుంచి ఒకరు  కరోనా వైరస్ అంటు పెట్టుకున్నారు. వేలాది మంది సభ్యుల్లో వందలాది మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో వారిని ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు మిగతా వారిని ఢిల్లీలోని పలు క్వారంటైన్లకు తరలించారు. కానీ అక్కడ కూడా వారు తమ బుద్ధిని ప్రదర్శించారు. 

ఢిల్లీ నరేలాలోని ఓ క్వారంటైన్ సెంటర్లో ఇద్దరు తబ్లీగీ జమాతే సభ్యులు 'గలీజు' పనికి పాల్పడ్డారు. రెండో అంతస్తులోని రూమ్ నంబర్ 212 ఎదుట మల విసర్జన చేశారు. వారిద్దరినీ శానిటేషన్ సిబ్బంది గుర్తించారు. గలీజు పని చేసిన మహ్మద్ ఫాద్, అద్నమ్ జహీర్ అనే ఇద్దరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే పోలీసులు వారిద్దరిపై ఎఫ్ఐర్ నమోదు చేశారు. మార్చి 31న రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. 

ఉత్తరప్రదేశ్ లోని బారాబంకికి చెందిన ఆ ఇద్దరు వ్యక్తులు తబ్లీగీ జమాతే సభ్యులుగా ఉన్నారు. నిజాముద్దీన్ లో జరిగిన మత ప్రార్థనలకు హాజరై.. ప్రస్తుతం క్వారంటైన్ లో  ఉంటున్నారు. అంతే కాదు గలీజు పని చేసిన తర్వాత శానిటేషన్ సిబ్బందిపై తిరగబడ్డట్లు తెలుస్తోంది.  వారిద్దరిపై ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

 

Trending News