Fact Check: ప్రభుత్వం మన బ్యాంకు అకౌంట్లలో రూ.2.67 లక్షలు జమ చేస్తోందా? మొబైల్‌కు వస్తున్న SMSల్లో నిజమెంత?

Fact Check: కొందరు వినియోగదారులకు అకస్మాత్తుగా వస్తున్న మెస్సేజ్‌లు వాళ్లను విస్తుపోయేలా చేస్తున్నాయి. తమ బ్యాంకు ఖాతాలో భారీ మొత్తంలో డబ్బులు జమ అయ్యాయన్నది ఆ మెస్సేజ్‌ సారాంశం. అలాంటి మెస్సేజ్‌ మీకు కూడా రావొచ్చు. మరి.. అలా వస్తే ఏం చేయాలి? అది నిజమేనా? చూద్దాం...  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 2, 2022, 04:33 PM IST
Fact Check: ప్రభుత్వం మన బ్యాంకు అకౌంట్లలో రూ.2.67 లక్షలు జమ చేస్తోందా? మొబైల్‌కు వస్తున్న SMSల్లో నిజమెంత?

Fact Check: కొందరు వినియోగదారులకు అకస్మాత్తుగా వస్తున్న మెస్సేజ్‌లు (Messages) వాళ్లను విస్తుపోయేలా చేస్తున్నాయి. తమ బ్యాంకు ఖాతాలో భారీ మొత్తంలో డబ్బులు జమ అయ్యాయన్నది ఆ మెస్సేజ్‌ సారాంశం. అలాంటి మెస్సేజ్‌ మీకు కూడా రావొచ్చు. మరి.. అలా వస్తే ఏం చేయాలి? అది నిజమేనా? చూద్దాం.

మొబైల్‌కు వస్తున్న మెస్సేజ్‌ ఏంటి?
మీ బ్యాంకు అకౌంట్‌లో ఏకంగా రెండు లక్షల 67వేల రూపాయలు ప్రభుత్వ యోజన పథకం (govt Yojana scheme) కింద జమ అయ్యాయంటూ ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయి. మీ ఖాతాకు ఆడబ్బులు బదిలీ అయ్యాయని పేర్కొంటున్నారు. మెస్సేజ్‌ చివరిలో ఒక లింక్‌ ఇస్తున్నారు. ఆ లింక్‌ క్లిక్‌ చేసి కొన్ని స్టెప్స్‌ ఫాలో కావాలని సూచిస్తున్నారు.

వాస్తవం ఏంటి?
సైబర్‌ నేరగాళ్లు (cyber criminals) ఎస్‌ఎంఎస్‌ల రూపంలో ఓ స్కామ్‌కు తెరతీస్తున్నారు. మొబైల్‌ ఫోన్లలోకి ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తూ ఉచ్చులోకి లాగుతున్నారు. వాస్తవానికి నేరుగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు జమ చేసే ప్రభుత్వ పథకం ఏదీ లేదు. కనీసం మనం దరఖాస్తు చేయకుండానే, ముందస్తు సమాచారం కూడా లేకుండానే ఇలాంటి మెస్సేజ్‌ వచ్చిందంటే కచ్చితంగా అనుమానించాల్సిందే అంటున్నారు సైబర్‌ నిపుణులు. ప్రభుత్వరంగ వార్తాసంస్థ పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ కూడా ఈ అంశాన్ని ధృవీకరించింది. ఇలాంటి ప్రభుత్వ పథకం ఏదీ లేదని, ఎవరూ నమ్మవద్దని సూచించింది. ఎవరికైనా అలాంటి మెస్సేజ్‌ వస్తే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇలాంటి ఫేక్‌ మెస్సేజ్‌ల పట్ల తోటివాళ్లను కూడా అప్రమత్తం చేయాలని కోరింది. 

Alsof Read: Tomato Price Hike: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన టమోట ధర! కిలో ఎంతంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News