Employer PF Contribution: జీతం నుంచి డబుల్ PF కట్ అవుతుందా.. EPFO రూల్స్‌లో ఏముంది?

#EPFO | కొందరు ఉద్యోగులు తమకు డబుల్ పీఎఫ్ కట్ అవుతుందని, కంపెనీలు తమ వాటా సైతం ఉద్యోగుల ఖాతాల నుంచే కట్ చేస్తున్నాయని భావిస్తుంటారు. అయితే ఈ విషయాలు తెలుసుకోవడం బెటర్.

Last Updated : Feb 21, 2020, 07:13 AM IST
Employer PF Contribution: జీతం నుంచి డబుల్ PF కట్ అవుతుందా.. EPFO రూల్స్‌లో ఏముంది?

యాజమాన్యాలు ఉద్యోగుల శాలరీలో మూల వేతనం (Basic Salary), డీఏల నుంచి 12 శాతం ఉద్యోగుల భవిష్య నిధి (Provident Fund) ఖాతాలో జమ చేస్తాయి. ఈపీఎఫ్ఓ (Employee Provident Fund Organisation) నిబంధనల ప్రకారం.. అంతే మొత్తాన్ని అంటే 12శాతాం నగదును యాజమాన్యాలు సైతం ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. అయితే తమ కంపెనీ వాటా నగదును కూడా యాజమాన్యాలు తమ వేతనం నుంచే కట్ చేసి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తున్నాయని ఉద్యోగులు భావిస్తుంటారు. కానీ కంపెనీలు ఎన్నటికీ ఉద్యోగి వేతనం నుంచి నగదును కట్ చేసి పీఎఫ్ ఖాతాకు జమ చేయదని గుర్తించాలి. 

నెల వేతనంలో బేసిక్, డీఏల నుంచి 12శాతం నగుదు పీఎఫ్ ఖాతాకు వెళ్తుందని తెలిసిందే. కంపెనీ సైతం అంతే నగదును ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు అందించాలి. ఇందులో 8.33 శాతం ఈపీఎఫ్‌ (Employee Pension Scheme)కు జమ కాగా, మిగిలిన 3.67శాతం నగదు ఉద్యోగి పీఎఫ్ కు చేరుతుంది. కానీ కంపెనీలు తెలివిగా ఉద్యోగికి కాస్ట్ టు కంపెనీ  (CTC) అని ఆఫర్ లెటర్ జారీ చేస్తుంటాయి. దీని ప్రకారం మీకు సంస్థ ఎంతమేర ఖర్చు చేస్తుందో వివరంగా ఉంటుంది. ఇందులోనే కంపెనీలు ఉద్యోగికి చెల్లించే తమ వాటా నెలవారీ పీఎఫ్ వివరాలను జత చేస్తాయి. అది చూసిన ఉద్యోగులు ఆఫర్ ఎక్కువగా కనిపించినా డబుల్ పీఎఫ్ వల్ల తక్కువ జీతం వస్తుందని భావిస్తుంటారు.

Also Read: శుభవార్త.. ఉద్యోగులకు ఆ కష్టం ఉండదు

ఉద్యోగులకు స్థూల వేతనం (Gross Salary), నికర వేతనం (Net Salary), కాస్ట్ టు కంపెనీ (CTC) అని మూడు రకాల బ్రేకప్ శాలరీలుంటాయి. గ్రాస్ శాలరీ అంటే మీ మొత్తం నెల లేక ఏడాది జీతాన్ని సూచిస్తుంది. నెట్ శాలరీ అంటే ఉద్యోగి చేతికి వచ్చే జీతం. సీటీసీ అంటే నెలకు లేక ఏడాది మొత్తంగా ఉద్యోగి కోసం ఆ కంపెనీకి అయ్యే ఖర్చు. గ్రాస్ శాలరీ కాకుండా సీటీసీతో ఆఫర్ చేస్తే అందులో మీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌తో పాటు ఆఫీసు కంట్రిబ్యూషన్ నగదు కలిపి చెప్తారు.

Also Read: 30 రోజుల్లో జాబ్ రాకపోతే.. 75 శాతం పీఎఫ్ విత్‌డ్రా 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News