ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ కోణం ఉండటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు ప్రదర్శిస్తోంది. నిందితుల ఆస్థులు స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించడమే కాకుండా..ఆ వివరాలు వెల్లడించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుల ఈడీ ఇప్పటి వరకూ సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లి, బినాయ్ బాబు, శరత్ చంద్రారెడ్డిలను అరెస్టు చేసింది. ఈ నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌పై ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. మరోవైపు ఈ కేసులో జప్తు చేసిన నిందితుల ఆస్థుల వివరాల్ని ఈడీ వెల్లడించింది.
ఈడీ జప్తు చేసిన ఆస్థుల వివరాలు
ఢిల్లీ మద్యం కేసులో నిందితులైన సమీర్ మహేంద్రు, గీతికా మహేంద్రులకు చెందిన జోర్‌బాగ్‌లోని 35 కోట్ల విలువైన నివాసాన్ని ఈడీ జప్తు చేసింది. ఇక మరో నిందితుడు అమిత్ అరోరాకు చెందిన గురుగ్రామ్‌లోని మ్యాగ్నోలియాస్‌లోని 7.68 కోట్ల నివాసాన్ని ఈడీ ఎటాచ్ చేసింది. ఇదే కేసులో మరో నిందితుడైన విజయ్ నాయర్‌కు చెందిన ముంబాయిలోని పారెల్, క్రిసెంట్ బేలోని 1.77 కోట్ల నివాసాన్ని ఈడీ జప్తు చేసింది.
ఇక దినేష్ అరోరాకు చెందిన 3.18 కోట్ల విలువైన రెస్టారెంట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. అరుణ్ పిళ్లైకు చెందగిన హైదరాబాద్‌లోని 2.25 కోట్ల విలువైన స్థలాన్ని, ఇండోస్పిరిట్ గ్రూప్‌కు చెందిన 10.23 కోట్ల విలువైన 50 వాహనాల్ని, 14.39 కోట్ల విలువైన బ్యాంకు బ్యాలెన్స్, డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది.
ఈ కేసులో అవినీతి, కుట్ర కారణంగా ఢిల్లీ మద్యం పాలసీ 2021-22 అమలులో 2873 కోట్ల నష్టం వాటిల్లిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఐపీసీ సెక్షన్ 120 బి, పీసీ చట్టం సెక్షన్ 7, 2018 ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఈ కేసులో 76.54 కోట్లు గుర్తించడమే కాకుండా స్వాధీనం చేసుకుంది.
ఇప్పటి వరకూ ఈడీ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దేశంలోని ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. సోదాల్లో లభ్యమైన వివరాల ప్రకారం విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా, శరత్ రెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయిన్‌పల్లిలను అరెస్టు చేసి కస్టడీకు తరలించింది.
Also read: Air india: ఎయిర్ ఇండియా మద్యం పాలసీలో మార్పులు, కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ జప్తు చేసిన 76 కోట్ల ఆస్థుల వివరాలు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దూకుడు పెంచిన ఈడీ
76 కోట్లకు పైగా నిందితుల ఆస్థులు జప్తు
ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో నిందితుల బెయిల్ పిటీషన్‌పై వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్