లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారు

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారు

Last Updated : Mar 10, 2019, 11:57 AM IST
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారు

న్యూఢిల్లీ: 2019 లోక్ సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారైంది. నేడు సాయంత్రం 5 గంటలకు దీనిపై ఓ ప్రకటన విడుదల చేయనున్నట్టు ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న లోక్ సభకు జూన్ 3తో పదవీకాలం ముగియనుంది. రానున్న రెండు నెలలపాటు 7-8 దశలలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారమే లోక్ సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించింది. 

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. షెడ్యూల్ విడుదలైన తర్వాత అన్ని ప్రాంతాలను చుట్టేందుకు సమయం సరిపోదనే ఉద్దేశంతో వివిధ రాజకీయ పార్టీలు వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నాయి.

Trending News