Again Earthquake in Delhi: ఢిల్లీలో మరోసారి భూకంపం.. వరుస భూకంపాలతో వణికిపోతున్న జనం

Second Earthquake in Delhi News Today: గత 24 గంటల్లో దాదాపు 10 కి పైగా భూకంపాలు ఉత్తర భారతాన్ని వణికించాయి. వరుస భూకంపాలతో ఎప్పుడు, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందా అని జనం ఆందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఢిల్లీని ఆనుకుని ఉన్న ప్రాంతాలకు చెందిన వారిలో ఈ భయం మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2023, 08:16 PM IST
Again Earthquake in Delhi: ఢిల్లీలో మరోసారి భూకంపం.. వరుస భూకంపాలతో వణికిపోతున్న జనం

Delhi Earthquake News Today: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. మంగళవారం రాత్రి ఢిల్లీని భూకంపం వణికించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ వాసులను ఆ భయం వెంటాడుతున్న సమయంలోనే బుధవారం సాయంత్రం మరోసారి భూకంపం సంభవించింది. సాయంత్రం 4.42 గంటల సమయంలో ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై భూకంపం తీవ్రత 2.7 మ్యాగ్నిట్యూడ్ గా నమోదైనట్టు వాతావరణ అధ్యయన కేంద్రం వెల్లడించింది.

జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించిన నివేదికల ప్రకారం ఆఫ్గనిస్తాన్‌లోని ఫైజాబాద్ కి ఆగ్నేయాన 133 కిమీ దూరంలో భూకంపం సంభవించింది. ఆఫ్గనిస్తాన్ లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 6.6 మ్యాగ్నిట్యూడ్ గా నమోదైంది. 156 కిమీ లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి దాటాకా 12.51 గంటల సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లోనూ భూకంపం సంభవించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నోర్‌లో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు.  

మంగళవారం రాత్రి 10.17 గంటల ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్‌లో సంభవించిన భూకంపం ఆ రాష్ట్ర వాసులను గజగజ వణికించింది. 6.6 మ్యాగ్నిట్యూడ్‌తో సంభవించిన భూకంపం ధాటికి షిమ్లా, మండి ప్రాంతాల్లోని జనం ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. ఆప్ఘనిస్థాన్‌లోని హిందూఖుష్ పర్వత ప్రాంతాల్లో 156 కిమీ లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఈ భూకంపం తీవ్రతకు హిమాచల్ ప్రదేశ్ లోని మొత్తం 12 జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. 

మొత్తానికి గత 24 గంటల్లో దాదాపు 10 కి పైగా భూకంపాలు ఉత్తర భారతాన్ని వణికించాయి. వరుస భూకంపాలతో ఎప్పుడు, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందా అని జనం ఆందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఢిల్లీని ఆనుకుని ఉన్న ప్రాంతాలకు చెందిన వారిలో ఈ భయం మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఆప్ఘనిస్తాన్ నుంచి పాకిస్థాన్, నేపాల్ వరకు ఎక్కడ భూకంపం జరిగినా.. వాటి ప్రకంపనలు ఢిల్లీని తాకుతున్నాయి. అలా ఢిల్లీ వాసులని తరచుగా భూకంపాలు భయపెడుతున్నాయి.

ఇది కూడా చదవండి : Rs 1 lakh Monthly Salary Job: మీకు మీమ్స్ చేయడం వచ్చా ? నెలకు లక్ష రూపాయల శాలరీ ఇచ్చే జాబ్ రెడీ

ఇది కూడా చదవండి : Tata Safari: నెక్సాన్ ధరలోనే 7 సీటర్ ఎస్‌యూవి కారు.. బేస్ వేరియంట్‌లోనే జబర్ధస్త్ ఫీచర్స్

ఇది కూడా చదవండి : SBI Home Loans: ఎస్బీఐ హోమ్ లోన్స్ తీసుకునే వారికి గుడ్ న్యూస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News