ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం స్వల్ప భూకంపం (mild earthquake) సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై ఈ భూకంపం తీవ్రత 2.5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైనట్టు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (National Centre for Seismology) తెలిపింది. ఢిల్లీతో పాటు ఢిల్లీని ఆనుకుని వున్న నొయిడా, గురుగ్రామ్,ఫరీదాబాద్, ఘాజీయాబాద్ ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఇదే ప్రాంతంలో భూకంపం రావడం వరుసగా ఇది రెండో రోజు కావడంతో ప్రజలు మరింత భయాందోళనలకు గురయ్యారు. నిన్న ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు కూడా ఇదే ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఆదివారం సంభవించిన భూకంపం రిక్టార్ స్కేలుపై 3.5గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. నేడు సంభవించిన భూకంపం స్వల్ప భూకంపమే అయినప్పటికీ.. వరుసగా రెండో రోజూ అదే ప్రాంతాల్లో భూమి కంపించడమే వారి భయాందోళనకు కారణమైంది.
Also read : రేపు లాక్ డౌన్ పొడగింపుపై స్పష్టత
ఆదివారం నాటి భూకంప కేంద్రం ఈశాన్య ఢిల్లీలోని వజీరాబాద్ కాగా నేటి భూకంపానికి ఎపిసెంటర్ కూడా ఢిల్లీలోనే ఉన్నట్టు తెలుస్తోంది. అదృష్టవశాత్తుగా ఈ రెండు భూకంపాల్లోనూ ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. 2.5 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో నేడు సంభవించిన భూకంపం స్వల్ప భూకంపం కిందే పరిగణించవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.