Dussehra 2024 Bank Holidays: ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే చాలు సెలవులు ప్రారంభమౌతాయి. అందరికీ సెలవులున్నట్టే బ్యాంకులకు కూడా సెలవులుంటాయి. ఈ నెలలో బ్యాంకులకు ఏకంగా 15 రోజులు సెలవులున్నాయి. ఆర్బీఐ జారీ చేసిన సెలవుల జాబితా ప్రకారం దసరా పురస్కరించుకుని ఏకంగా 5 రోజులు బ్యాంకులు తెర్చుకోవు. ఈ సమయంలో బ్యాంకు పనులుంటే సెలవులకు తగ్గట్టు ప్లాన్ చేసుకోవడం మంచిది.
అక్టోబర్ నెలలో దసరా, దీపావళి పండుగలు పురస్కరించుకుని ఫెస్టివల్ సీజన్ ఉంది. మొత్తం 15 రోజులు సెలవులున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో 5 రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. ఆర్బీఐ ఈ జాబితా విడుదల చేసింది. దసరా పురస్కరించుకుని బ్యాంకులకు 5 రోజులు సెలవులు ప్రకటించింది ఆర్బీఐ. అయితే 5 రోజుల సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించదు. కొన్ని రాష్ట్రాలకే వర్తించనుంది. కొన్ని రాష్ట్రాల్లో ఆర్బీఐ దసరా సందర్బంగా వరుసగా 5 రోజులు సెలవులు ప్రకటించింది. ముఖ్యంగా త్రిపుర, అస్సోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ నెల 10 నుంచి 13 వరకూ వరుసగా ఐదు రోజులు సెలవులున్నాయి. ఇక సిక్కింలో అక్టోబర్ 11 నుంచి 14 వరకూ సెలవులున్నాయి.
దసరా సందర్భంగా ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు
అక్టోబర్ 10వ తేదీన త్రిపుర, అస్సోం, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సెలవు
అక్టోబర్ 11న మహా నవమి, ఆయుధ పూజ సందర్భంగా త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, అస్సోం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, బీహార్, జార్ఖండ్, మేఘాలయ రాష్ట్రాల్లో సెలవు
అక్టోబర్ 12న దసరా సందర్భంగా దేశమంతా సెలవుంది. ఆ రోజు రెండవ శనివారం కూడా ఉంది.
అక్టోబర్ 13 ఆదివారం సెలవుంది.
అక్టోబర్ 14న దుర్గా పూజ సందర్భంగా సిక్కింలో బ్యాంకులకు సెలవు
ఇతర సెలవులు
అక్టోబర్ 16 లక్ష్మీ పూజ సందర్భంగా అగర్తల, కోల్‌కతాలో సెలవు
అక్టోబర్ 17న మహారుషి వాల్మీకి జయంతి సెలవు
అక్టోబర్ 20న ఆదివారం సెలవు
అక్టోబర్ 26న జమ్ము కశ్మీర్లో సెలవు, నాలుగో శనివారం సెలవు
అక్టోబర్ 27 ఆదివారం సెలవు
అక్టోబర్ 31 దీపావళి సెలవు
Also read: 7th Pay Commission DA Hike: ఉద్యోగులకు శుభవార్త, రేపే డీఏ పెంపు ప్రకటన, దీపావళి బోనస్ కూడా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.