అసలే తాగి ఉన్నాడు.. ఆపై అత్యంత వేగంతో పరుగులుతీసే ఖరీదైన లగ్జరీ కారు ఎక్కి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. డ్రైవర్‌నే కదా అని తన మాట వినకపోతుందా అనుకున్నాడో ఏమో కానీ రోడ్డుపైకొచ్చాకా.. కారుపై కంట్రోల్ తప్పింది. ఇంకేం.. తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో తెలియకుండానే వేగంగా వెళ్తూ ఇద్దరిని ఢీ కొట్టాడు. ఆ తర్వాత కూడా కారుని ఆపకుండానే వేగంగా పోనిస్తుండటంతో అతడి వెంటపడి చేజ్ చేసిన పోలీసులు ఎట్టకేలకు 4 కిలోమీటర్ల తర్వాత అతడిని పట్టుకున్నారు. ముంబైలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. డ్రైవర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు. బీఎండబ్ల్యూ కారు యజమాని దుబాయ్‌లో ఉండగా.. ముంబైలో ఉన్న కారు డ్రైవర్ మాత్రం ఇలా తాగిన మత్తులో కారు నడిపి రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడు.