COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లలు పుట్టరా, కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ

Does COVID-19 Vaccine Causes infertility: కోవిడ్19 వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో సంతానలోపం, సంతాన సమస్యలు తలెత్తుతాయని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో సైతం ఇందుకు సంబంధించి కొందరు రాసిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 22, 2021, 08:37 AM IST
COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లలు పుట్టరా, కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ

Does COVID-19 Vaccine Causes infertility: ఓవైపు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కోవిడ్19 వ్యాక్సిన్లు తీసుకోవడమే అత్యుత్తమ మార్గమని, దానికి మించిన మార్గం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నా, కరోనా వ్యాక్సిన్లపై నిత్యం ఏదో ఒక అనుమానం తలెత్తుతుంది. కోవిడ్19 వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో సంతానలోపం, సంతాన సమస్యలు తలెత్తుతాయని ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో సైతం ఇందుకు సంబంధించి కొందరు రాసిన విషయాలు వైరల్ అవుతున్నాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ స్పందించింది. కోవిడ్19 వ్యాక్సిన్లు తీసుకుంటే సంతానలోపం తలెత్తుతుందనేది నిజం కాదని స్పష్టం చేశారు. ఆడవారు, మగవారిలో ఇలా జరిగిందని చెప్పడానికి ఏ ఆధారాలు లేవని పేర్కొన్నారు. అవి కేవలం వదంతులేనని, వాటిని నమ్మవద్దని సూచించారు. క్లినికల్ టెస్టులు చేసిన అనంతరం వ్యాక్సిన్లు ఇస్తున్నామని, వదంతులు నమ్మి వ్యాక్సినేషన్‌కు దూరం కావొద్దని అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు సూచించింది.

Also Read: Telangana COVID-19 updates: తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. పెరిగిన రికవరీ రేటు

జంతువులపై ప్రయోగాలు చేసి ఫలితాలు సాధించిన అనంతరం మనుషులపై కోవిడ్19 వ్యాక్సిన్లు పరీక్షించారని తెలిపారు. ఫలితాలు పొందిన అనంతరం వ్యాక్సిన్లు ఆమోదం పొందుతాయని వెల్లడించారు. వ్యాక్సిన్ల నుంచి భద్రత, వాటి సామర్థ్యం గుర్తించిన అనంతరం కరోనా వ్యాక్సిన్లకు ఆమోదం లభించిందని ఆ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. గతంలో పోలియో చుక్కలపై సైతం ఇదే తీరుగా వదంతులు వ్యాప్తి జరిగినట్లు గుర్తుచేసింది. కానీ చుక్కులు వేసుకున్న వారు ప్రయోజనం పొందారని, ఆరోగ్యంగా ఉన్నారని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మంత్రి హర్షవర్దన్ ట్వీట్ చేశారు.

Also Read: COVID-19: మృతుల కుటుంబాలకు పరిహారంపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News