పటియాలా: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌ను అమలయ్యేలా చూస్తున్న ఓ పోలీసు అధికారి చేతిని కొందరు దుండగులు నరికేయడం తెలిసిందే. చండీగఢ్ వైద్యులు శస్త్ర చికిత్స చేసి పోలీసు చేతిని తిరిగి అతికేలా చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడం సంతోషకరమైన విషయం. అసలేం జరిగిందంటే.. పటియాలాలోని కూరగాయల మార్కెట్ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఏఎస్‌ఐ ఆపారు. లాక్‌డౌన్ టైమ్ కనుక పాస్‌లు చూపించాలని పోలీసులు కోరారు. భారత్‌లో కరోనా మరణ మృదంగం..
అయితే అడ్డుగా ఉన్న బారికేడ్లను ఢీకొట్టి వాహనంతో ముందుకొచ్చిన ఆ దుండుగులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో తమ వద్ద ఉన్న ఆయుధాలతో ఏఎస్‌ఐ చేతిని నరికేశారు. మరో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఘటన అనంతరం దుండుగులు అక్కడి నుంచి పరారయ్యారని పటియాలా సీనియర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ మన్‌దీప్ సింగ్ తెలిపారు. Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos
ఏఎస్‌ఐ సహా గాయపడ్డ పోలీసులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోంస చండీగఢ్ పీజీఐకి తరలించారు. ఏడుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా శస్త్ర చికిత్స చేసి ఆ చేతిని తిరిగి ఏఎస్‌ఐకి అతికించినట్లు వైద్యులు తెలిపారు. ప్రొఫెసర్, డాక్టర్ రమేష్ శర్మ మాట్లాడుతూ.. మరో 48 గంటలపాటు అబ్వర్వేషన్‌లో ఉంచామని చెప్పారు. ఎముకలు, నరాలు సెట్ అయ్యేలా చేయడానికి శ్రమించాల్సి వచ్చిందని, మొత్తానికి విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేశామన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos
ఆ పోలీసు చేతిని మళ్లీ అతికించారు