Doctor removes patient's trousers: డాక్టర్ కాదు.. కామాంధుడు.. మహిళా పేషెంట్‌ ప్యాంట్ తీసేసి..

Doctor molestes woman patient in clinic: క్లినిక్‌లో తనను ఒంటరిగా లోపలికి రమ్మన్న డాక్టర్.. హెల్త్ చెకప్ (Health check-up) పేరుతో తనను పడుకోవాల్సిందిగా చెప్పి ప్యాంట్ విప్పి చేయి లోపలికి పెట్టి ప్రైవేటు పార్ట్స్ తాకేందుకు ప్రయత్నించాడని.. ఎలాగోలా అతడి బారి నుంచి తప్పించుకుని బయటపడ్డానని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2021, 08:47 AM IST
Doctor removes patient's trousers: డాక్టర్ కాదు.. కామాంధుడు.. మహిళా పేషెంట్‌ ప్యాంట్ తీసేసి..

Doctor molestes woman patient: పనాజి: తన ఆరోగ్య సమస్య చెప్పుకోవడానికి వచ్చిన మహిళా పేషెంట్‌పై కన్నేసిన ఓ డాక్టర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇది. గోవాలోని మపుసలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మపుసకు చెందిన ఓ మహిళ నడుం నొప్పితో (Hip pain) బాధపడుతూ స్థానికంగా ఉన్న ఓ క్లినిక్‌లో ఆర్థోపెడిక్ సర్జన్‌ని ఆశ్రయించింది. ఈ క్రమంలోనే హెల్త్ చెకప్ సందర్భంగా ఆ డాక్టర్ తన పట్ల ప్రవర్తించిన అసభ్య తీరుపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. 

క్లినిక్‌లో తనను ఒంటరిగా లోపలికి రమ్మన్న డాక్టర్.. హెల్త్ చెకప్ (Health check-up) పేరుతో తనను పడుకోవాల్సిందిగా చెప్పి ప్యాంట్ విప్పి చేయి లోపలికి పెట్టి ప్రైవేటు పార్ట్స్ (private parts) తాకేందుకు ప్రయత్నించాడని.. ఎలాగోలా అతడి బారి నుంచి తప్పించుకుని బయటపడ్డానని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఎదురైన ఈ చేదు అనుభవం గురించి బాధితురాలు ముందుగా వెళ్లి తన భర్తకు చెప్పగా.. అతడు వెళ్లి డాక్టర్ చెంప ఛెళ్లుమనిపించాడని టైమ్స్ నౌ ప్రచురించిన ఓ కథనంలో పేర్కొంది. ఆర్థోపెడిక్ సర్జన్ అసభ్య ప్రవర్తన పట్ల కన్నీటి పర్యంతమైన బాధితురాలు మపుస పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also read : Sexual assault during online classes: ఆన్‌లైన్ క్లాసుల పేరిట ఇంటర్ విద్యార్థినిపై లెక్చరర్‌ లైంగిక వేధింపులు

మహిళా పేషెంట్‌పై డాక్టర్ లైంగిక దాడి (Molesting a woman) ఘటనపై మపుస డిప్యూటీ సూపరింటెండెంట్ గజానన్ ప్రభుదేశాయ్ మాట్లాడుతూ.. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుడు కూడా యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు డీఎస్పీ గజానన్ పేర్కొన్నారు.

Also read : SI sexual harassment on woman trainee SI: మహిళా ట్రైనీ ఎస్సైపై అత్యాచారయత్నం కేసులో ఎస్సైకి రిమాండ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News