ఇక పేటీఎం ద్వారా కూడా.. ఎల్ఐసీ ప్రీమియం చెల్లించవచ్చు..!

డిజిటల్ వాలెట్ సేవల సంస్థ పేటీఎం ద్వారా కూడా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించవచ్చు. ఈ మేరకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనను విడుదల చేసింది. 

Last Updated : Nov 21, 2018, 03:48 PM IST
ఇక పేటీఎం ద్వారా కూడా.. ఎల్ఐసీ ప్రీమియం చెల్లించవచ్చు..!

డిజిటల్ వాలెట్ సేవల సంస్థ పేటీఎం ద్వారా కూడా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించవచ్చు. ఈ మేరకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనను విడుదల చేసింది. పేటీఎం సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.  ఇప్పటికే భారతదేశంలో దాదాపు 30 జీవిత బీమా సంస్థలు ప్రీమియం చెల్లింపుల కోసం పేటీఎం సేవలు తీసుకుంటున్నాయి. తాజాగా.. ఆ జాబితాలోకి ఎల్ఐసీ కూడా చేరింది.

కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్, శ్రీరాం లైఫ్, స్టార్ హెల్త్, మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా ఏఐఏ, ఎస్‌బీఐ లైఫ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, రిలయన్స్ లైఫ్ సంస్థలు మాత్రమే ఇప్పటి వరకూ తమ ప్రీమియమ్స్ పేటీఎం ద్వారా చెల్లించడానికి తమ వినియోగ దారులకు సౌలభ్యాన్ని కల్పించాయి.  పేటీఎం బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న దాని మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ సంస్థ ప్రతినిధులు తాజాగా ఎల్ఐసీతో తమ ఒప్పందం గురించి తెలిపారు. ఈ నెల 21వ తేది నుండి ఈ సేవలు అమలులోకి వస్తాయని ప్రకటించారు. 

ఈ క్రమంలో పేటీఎం బ్రాండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కిరణ్ వాసిరెడ్డి మాట్లాడుతూ, దేశంలో అనేకమంది అత్యధిక శాతం ఇన్సూరెన్స్ ప్రీమియంలను ఆఫ్ లైన్ పద్ధతి ద్వారానే చెల్లిస్తున్నారని.. ఆ పద్ధతికి స్వస్తిపలుకుతూ.. సాధారణ పౌరులు కూడా కేవలం ఒక క్లిక్‌తో ప్రీమియం చెల్లించే సౌలభ్యాన్ని పేటీఎం సంస్థ కల్పిస్తోందని తెలిపారు. 

Trending News