పెన్షనర్లకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) శుభవార్త చెప్పింది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో నుంచి ప్రతి నెలా పెన్షన్ అందుతుందని తెలిసిందే. అయితే పెన్షన్ పొందాలంటే పింఛన్‌దారులు (Pensioners Life Certificate) లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అంటే తాము జీవించి ఉన్నట్లు తెలిపితేనే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు నెలా నెలా పింఛన్ అందిస్తారు.
- Also Read : PF Balance Missed Call Number: పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోవచ్చు.. ఒక్క మిస్డ్ కాల్ చాలు
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో వయసు మీద పడిన ఫించన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు ఈపీఎఫ్‌వో కార్యాలయానికి వెళ్లడం చాలా కష్టం. ఈ సమస్యను తొలగించేందుకు ముందుకు సంవత్సరంలో ఎప్పుడైనా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు వెసులుబాటు కల్పించిన ఈపీఎఫ్‌వో తాజాగా మరో అవకాశాన్ని కల్పించింది. జీవన్ ప్రమాణ్ పత్రాన్ని పోస్టాఫీసు ద్వారా సమర్పించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.70 చెల్లించి పోస్టాఫీసు ద్వారా లైఫ్ సర్టిఫికెట్ పొందవచ్చు. దీన్ని సమర్పించి పెన్షన్ పొందవచ్చునని ఈపీఎఫ్‌వో తెలిపింది.
- Also Read : EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్
కేవలం 5 నిమిషాల్లో డిజిటల్ జీవన్ ప్రమాణ్ పత్రాన్ని పోస్టాఫీసు అందిస్తుంది. దీన్ని పోస్టాఫీసు ద్వారా సమర్పించడం ద్వారా ఈపీఎఫ్ పింఛన్‌ను నెలా నెలా అందుకోవచ్చు. గతంలో కొంత నిర్ణీత సమయంలోనే అందజేయాల్సిన లైఫ్ సర్టిఫికెట్‌ను డిసెంబర్ లోగా ఏడాదిలో ఎప్పుడైనా సమర్పించవచ్చునని ఇటీవల వెసులుబాటు కల్పించింది. తాజాగా ఆన్‌లైన్ ద్వారా, పోస్టాఫీసు ద్వారా, బ్యాంకుల ద్వారా వికలాంగులు, వృద్ధులు జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించి ప్రతినెలా ఏ ఇబ్బంది లేకుండా పింఛన్ పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe