ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో కన్ను కొట్టిన దృశ్యాన్ని మరవకముందే కేంద్రం మంత్రి స్మృతీ ఇరానీ ఈల అంశం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అదేనండి.. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఈల వేసి సభను అవమానించారని ఇటీవలే సోషల్ మీడియాలో ఓ పోస్టు తెగ వైరల్ అవుతోంది కదా. నసీమ్ అహ్మద్ అనే వ్యక్తి పోస్టు చేసిన ఈ ఫొటోను నెటిజన్లు తెగ షేర్ చేసుకుంటున్నారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న మహిళ ఇలా ఎందుకు ప్రవర్తించారని చర్చించుకుంటున్న తరుణంలో.. ఇది ఫేక్ పోస్ట్ అని...దీన్ని నమ్మెద్దని మరోవైపు నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది.
नारंगी खटमलों को राहुल गांधी का आँख मारना बुरा लग रहा हैं
पर @smritiirani का संसद मे सीटी मारना पसंद आया था
इतना दौगला चरित्र कंहा से लाते हो
दल्लाल मीडिया भी परेशान#ChowkidarNahiBhagidar@ajaymaken @PiyushGoyal @PMOIndia @RSSorg @divyaspandana pic.twitter.com/readWQdNoT— Naseem Ahmed 🇮🇳 (@NNaseemahmad071) July 23, 2018
వాస్తవానికి ఇక ఈ ఫొటో గత ఏడాది అక్టోబర్ దని.. ఆమె ఈల వేసింది పార్లమెంట్ లో కాదని బీజేపీ మద్దతు దారులు పేర్కొంటున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో విద్యార్థులను ఉత్సాహ పరిచేందుకు స్మృతీ ఇరానీ విజిల్ వేశారని చెబుతున్నారు. కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేస్తే ఈ ఫోటో ఎప్పటిదో తెలిసిపోతుందని సవాల్ చేస్తున్నారు. మోడీ సర్కార్ పై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఇలాంటి విష ప్రచారం చేస్తుందని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తన ప్రసంగం అనంతరం ప్రధాని మోదీని కౌగిలించుకోవడం.. ఆపై తన స్థానంలో కూర్చుని కన్ను కొట్టిన దృశ్యాలను వైరల్ చేస్తూ రాహుల్ తీరుపై బీజేపీ కార్యకర్తలు విమర్శలు సంధిస్తుండగా ..దీనికి ప్రతిగా స్మృతీ ఇరానీ ఈల వేస్తున్న దృశ్యాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు వైరల్ చేస్తున్నట్లు టాక్.