Delta Plus Variant Corona Cases: ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే గత వారం రోజులుగా దాదాపుగా 50 వేల కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 50,040 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,33,183కు (30 కోట్ల 2 లక్షల 33 వేల 183)కు చేరుకుంది.
కరోనాతో పోరాడుతూ గడిచిన 24 గంటల్లో 1,258 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కోవిడ్19 బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 3,95,751 (3 లక్షల 95 వేల 751)కి చేరుకుంది. దేశంలో యాక్టివ్ కేసులు 6 లక్షల దిగువకు చేరుకున్నాయి. ఇండియాలో ప్రస్తుతం 5,86,403 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. దేశంలో కరోనా వైరస్ (COVID-19 Delta Variant) రికవరీ రేటు 96.75 శాతానికి చేరింది. అదే సమయంలో 57,944 మంది కరోనాను జయించారు. ఇప్పటివరకూ 2,92,51,029 మంది కోవిడ్19 బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు.
Also Read: Delta Variant Threat: ఆ దేశాల్ని టార్గెట్ చేసిన డెల్టా వేరియంట్, మరోసారి ఆంక్షలు
మరోవైపు దేశంలో పలు రాష్ట్రాలలో డెల్టా, డెల్టా ప్లస్ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఏపీలోనూ ఇటీవల డెల్టా ప్లస్ కేసు నమోదు కాగా, చికిత్స అనంతరం బాధితుడు కోలుకున్నాడు. మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాలలో డెల్టా ప్లస్ కోవిడ్19 వేరియంట్ కేసులు అధికమవుతున్నాయి. మరో కొన్ని వారాల్లో కరోనా థర్డ్ వేవ్ (COVID-19 New Wave) సూచనల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను నిపుణులు హచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలోనూ కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయిని, దీనిపై ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది.
Also Read: Delta Variant of Covid-19: రోగ నిరోధకశక్తికి అందని డెల్టా వేరియంట్, అధ్యయనంలో షాకింగ్ విషయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook