మోటార్ వాహన చట్టంపై దేశ రాజధాని ఢిల్లీలో వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. హెల్మెట్ లేదని .. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని .. వాహనాల కాగితాలు సరిగ్గా లేవని .. పోలీసులు నిబంధనలకు అనుగుణంగా జరిమానా విధిస్తున్నారు. వాహనదారులు పట్టుబడినప్పుడు చలాన్లు కట్టాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. దీంతో వాహనదారుల్లోనూ ఓ రకమైన ఆందోళన నెలకొంది. తాజాగా ఢిల్లీలో మరో ఘటన జరిగింది. నిన్న ఓ యువకుడి బైక్ పై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. నిర్దేశించిన మొత్తాన్ని జరిమానా రూపంలో చెల్లించి వాహనం తీసుకెళ్లాలని తెలిపారు. ఐతే ఆ యువకుడు జరిమానా కట్టేందుకు నిరాకరించాడు. పైగా తన బైక్ కు తనే నిప్పంటించాడు. నడి రోడ్డుపైనే ఈ ఘటన జరిగింది. తన బైక్ ను తగలబెట్టుకుంటాను కానీ .. ఎట్టి పరిస్థితుల్లో జరిమానా కట్టేది లేదని యువకుడు తెగేసి చెప్పాడు. దీంతో పోలీసులు .. యువకునిపై మరో కేసు నమోదు చేసుకుని అరెస్టు చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..