Rouse Avenue Court Grants Bail To Delhi CM Arvind Kejriwal: దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఘటన ప్రస్తుతం హట్ టాపిక్ గా మారింది. ఇప్పటిక ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది. నిన్న బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ను అరెస్టు చేయడం దేశంలో తీవ్ర చర్చనీయాంగా మారింది. నిన్న మధ్యాహ్నం నుంచి కల్వకుంట్ల కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి, ఆతర్వాత అరెస్టు వారెంట్ ఇచ్చారు. రాత్రికి రాత్రే ఈడీ అధికారులు ఎమ్మెల్సీకవితను ఢిల్లీకి తీసుకెళ్లారు. ఈక్రమంలో ఆమె ఇంటి దగ్గర పెద్ద హైడ్రామా జరిగిందని చెప్పుకోవచ్చు.
Read More: Eating More Pythons: జస్ట్ ఫర్ ఏ చెంజ్... కొండ చిలువలను తినాలంటున్న పరిశోధకులు... కారణం ఏంటంటే..?
ఇదిలా ఉండగా.. ఇదే లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కూడ తమ ముందు హజరుకావాలని ఈడీ అనేక పర్యాయాలు నోటీసులు జారీ చేసింది. కానీ ఆయన పట్టించుకోక పోవడంతో ఈడీ కోర్టును పిటిషన్ దాఖలు చేసింది.తమ ముందు హజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసింది. ఈడీ అధికారుల నోటీసులను పట్టించుకోకపోవడం.. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 174ను ఉల్లంఘించడమే అని ఈడీ అభిప్రాయపడింది. ఈ క్రమంలో.. సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో విచారణకు హజరయ్యారు. సీఎం తరపు లాయర్లు ఆయన వాదనలను వినిపించారు. దీంతో కోర్టు.. సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ ను మంజూరు చేస్తు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా.. బెయిల్ కోసం ₹ 15,000 వ్యక్తిగత బాండ్‌ను అందించాలని కోరారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి మిస్టర్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించాలనుకుంటున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద జారీ చేసిన ఎనిమిది సమన్లను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పట్టించుకోకపోవడంతో.. కోర్టుకు తెలిపిన తర్వాత కోర్టు ఆప్ చీఫ్‌కి సమన్లు జారీ చేసింది. ED సమన్లను దాటవేస్తూ, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను ఉపయోగిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు.
Read More: BS Yediyurappa: మైనర్ బాలికపై మాజీ సీఎం అత్యాచారం.. కన్నతల్లి వేడుకుంటున్నా కూడా..
ED యొక్క తాజా సమన్లు ఫిబ్రవరిలో ఆలస్యంగా వచ్చాయి. మార్చి 4న విచారణకు హాజరుకావాలని ముఖ్యమంత్రిని కోరింది. అయితే, "చట్టవిరుద్ధమైన" సమన్లను దాటవేసిన Mr కేజ్రీవాల్, వీడియో-కాన్ఫరెన్సింగ్ ద్వారా మాత్రమే హాజరవుతానని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ లో ఇప్పుడు రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆప్ అగ్రనేతలు - ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లను ED అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook