Delhi Air Pollution Level: ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ నగరంలోని ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 10 వరకు మూసివేయనున్నట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి తెలిపారు. అదేవిధంగా 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాలుష్య స్థాయిలు 'తీవ్ర' కేటగిరీకి పడిపోవడంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలకు ఆదివారం వరకు సెలవులు ప్రకటించగా.. తాజాగా ఈ నెల 10వ తేదీ వరకు పొడగించారు. ఆదివారం ఢిల్లీలో గాలి నాణ్యత వరుసగా నాల్గవ రోజు తీవ్ర కేటగిరీలో నమోదైంది.
సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR-ఇండియా) నివేదించిన ప్రకారం.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) శనివారంతో పోలిస్తే.. 410 రికార్డెడ్ విలువతో స్వల్పంగా పెరిగింది. లోధి రోడ్ ప్రాంతంలో గాలి నాణ్యత 385 నమోదైంది. అయితే ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రాంతం AQI 456 ఎక్కువగా నమోదైంది. నోయిడాలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. AQI 466 వద్ద గాలి నాణ్యత 'తీవ్రమైన' కేటగిరీకి పడిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుగ్రామ్‌లో 392 AQIని నమోదు కాగా.. గాలి నాణ్యతను 'వెరీ పూర్' కేటగిరీ కింద ఉంచారు.
వాయు కాలుష్య నియంత్రణకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది ఢిల్లీ సర్కారు. ఢిల్లీ-ఎన్సీఆర్లోని పొరుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాల ప్రవేశాన్ని నిషేధించాలని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌కు లేఖ రాశారు. పొరుగు రాష్ట్రాల పర్యావరణ మంత్రుల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
ఢిల్లీలో భారీగా పెరిగిన వాహనాల రద్దీకి తోడు ఉన్న హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో రైతులు పంట వ్యర్ధాల్ని తగలబెడుతుండటంతో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇది ఏటా జరిగే వ్యవహారమే. అయినా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టడం లేదు. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూ.. స్వచ్ఛమైన గాలి కోసం ఎదురుచూస్తున్నారు. చిన్నారులు, వృద్ధులకు శ్వాస సమస్యలు వస్తున్నాయి.
వాయు కాలుష్యం ఎఫెక్ట్ వరల్డ్ కప్పైన కూడా పడింది. సోమవారం జరిగే ఢిల్లీ వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. అయితే మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ చేసేందుకు
వాయు కాలుష్యం అడ్డంకిగా మారింది. శ్రీలంక ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు దూరంగా ఉండగా.. బంగ్లాదేశ్ ఆటగాళ్లు శనివారం మాస్కులు ధరించి ప్రాక్టీస్ చేశారు. వాయుష్య కాలుష్యం ఇలానే ఇబ్బంది పెడితే.. మ్యాచ్ నిర్వహణపై కూడా ఐసీసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read: Bjp-Janasena: తెలంగాణలో కుదిరిన పొత్తు, జనసేనకు 9 సీట్లు, ఓకే చెప్పిన పవన్ కళ్యాణ్
Also Read: Dust Allergy: డస్ట్ అలర్జీ బాధిస్తోందా..? అయితే ఈ ఐదు రకాల టిప్స్‌ను ట్రై చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook