ప్రభుత్వ నిర్ణయాలను లెఫ్టినెంట్‌ గవర్నర్ అడ్డుకోరాదు: సుప్రీంకోర్టు

దేశ రాజధాని ఢిల్లీలో గత కొంతకాలంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ), ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం మధ్య తలెత్తిన అధికారాల వివాదంలో అర్వింద్ క్రేజీవాల్ ప్రభుత్వం విజయం సాధించింది.

Last Updated : Jul 5, 2018, 12:17 PM IST
ప్రభుత్వ నిర్ణయాలను లెఫ్టినెంట్‌ గవర్నర్ అడ్డుకోరాదు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత కొంతకాలంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ), ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం మధ్య తలెత్తిన అధికారాల వివాదంలో అర్వింద్ క్రేజీవాల్ ప్రభుత్వం విజయం సాధించింది. ఈ కేసులో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానిదే అసలైన అధికారమని స్పష్టం చేసింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు పరిపాలనపై నిర్ణయాలు తీసుకొనే స్వతంత్ర అధికారాలు లేవని తెలిపింది. ఏ నిర్ణయమైనా కేబినేట్ అనుమతితో అమలు చేయాలని.. ప్రభుత్వం-లెఫ్టినెంట్‌ గవర్నర్ కలిసి పనిచేయాలని తీర్పిచ్చింది.

గవర్నర్ యాంత్రికంగా ఉండవద్దని సీజేఐ దీపక్‌ మిశ్రా నేతృత్వ ధర్మాసనం స్పష్టం చేసింది. కొన్ని వ్యవహారాల్లో అభిప్రాయభేదాలు వస్తే దాన్ని ఎల్జీ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లొచ్చని జస్టిస్‌ మిశ్రా అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయాలను లెఫ్టినెంట్‌ గవర్నర్ కి చెబితే చాలు తప్ప.. అనుమతి అవసరం లేదని పేర్కొంది.

2015లో ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే అప్పటి లెఫ్టినెంట్‌ గవర్నర్ నజీబ్‌ జంగ్‌తో అధికార వివాదం తలెత్తింది. ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల్లో   జంగ్‌ జోక్యం చేసుకోవడం.. ఆ తర్వాత ఎల్జీగా వచ్చిన అనిల్‌ బైజల్‌ కూడా ఈ అంశాల్లో జోక్యం చేసుకోవడంతో వివాదం మరింత ముదిరింది. దీనిపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పై విధంగా తీర్పు నిచ్చింది.

Trending News