Young Girl Traveled in Delhi Metro Wearing Bra & Micro Miniskirt: భారత దేశంలో యువత రోజురోజుకు మితిమీరి ప్రవర్తిస్తోంది. తమ పిచ్చి పనులు, చేష్టలతో అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా భారత దేశ గౌరవాన్ని కాపాడే వస్త్రధారణ విషయంలో. ప్రస్తుతం యువత ఎక్కువగా చిట్టిపొట్టి దుస్తులు వేసుకుంటూ 'ఫ్యాషన్' అంటున్నారు. కొందరు అయితే అవి కూడా సక్రమంగా వేసుకోవడం లేదు. టూ పీసెస్ వేసుకుని బయటికి వచ్చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా కొందరు యువతులు కేవలం బ్రా, మైక్రో మినీ స్కర్ట్ ధరించి మెట్రో ట్రైన్‌లో హల్చల్ చేశారు. ఇందుకు సంబందించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఢిల్లీ మెట్రో (Delhi Metro) రైల్లో ఓ యువతి వేసుకున్న డ్రెస్ అందరూ షాక్ అయ్యేలా చేసింది. ఓ యువతి కేవలం బ్రా మరియు మైక్రో మినీ స్కర్ట్ (Delhi Metro Girl in Bikini) ధరించి ఢిల్లీ మెట్రో ఎక్కింది. ఒక్క మాటలో చెప్పాలంటే బికినీ వేసుకుందని చెప్పొచ్చు. మెట్రో రైలులో ఉన్న వందల మంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. అందరూ ఆ యువతిని వింతగా చూశారు. అయితే సీట్లో కూర్చొని ఉండగా.. ఆ అమ్మాయి తనకు ఓ బ్యాగ్ అడ్డుపెట్టుకుంది. లేచి వెళుతుండగా.. ఆమె డ్రెస్ చేసి అందరూ షాక్ తిన్నారు.
సదరు అమ్మాయి టూ పీస్‌లో (Delhi Metro Girl) వెళుతుండగా మెట్రోలో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు వీడియో, ఫొటోలను తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. 'Tanisha Batra' అనే ట్విటర్ యూసర్ ఓ వీడియోని పోస్ట్ చేశారు. 'సీరియస్ గా ఇది ఢిల్లీలో జరిగిందా?. అఖిర్ మజ్బూరీ క్యా హై?' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్న అమ్మాయిపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉర్ఫీ జావేద్ నుంచి ప్రేరణ పొందిందేమో అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ డ్రెస్ వేసుకోవడాన్ని కొందరు సమర్ధిస్తున్నారు. ఆమె దుస్తులు ఆమె ఇష్టం అని అంటున్నారు.
Seriously this is in delhi
Akhir Majburi kya hai ?#Delhi #delhimetro #PriyankaChopra #ChitrangdaSingh pic.twitter.com/x2BkeJsINz
— Tanisha Batra (@TanishaBatra80) March 31, 2023
అంతకుముందు కూడా ఓ కొందరు యువతులు కూడా బికినీ వేసుకుని ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ప్రపంచంలోనే ఉత్తమంగా అనుసంధానించబడిన మెట్రో రైల్ నెట్‌వర్క్‌లలో ఢిల్లీ మెట్రో ఒకటి. ఢిల్లీలోని అనేక ప్రాంతాల గుండా ఢిల్లీ మెట్రో వెళుతుంది. 300 కంటే ఎక్కువ రైలు సెట్లలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణం చేస్తుంటారు. సురక్షిత, వేగవంతమైన ప్రయాణానికి ఢిల్లీ మెట్రో ఎంత గుర్తింపు పొందిందో.. అసాంఘీక ఘటనలకు కూడా అంతే గుర్తింపు పొందింది.
What is wrong with #delhimetro
🙈 #Girls How can you travel like this in #delhimetro 😰#DelhiMetroDiaries #delhi #womenempowement #womensafety #delhipolice #CISF #feminism #feminist #feminists
●Lets see if @OfficialDMRC @DelhiPolice have the guts to ans these ques? pic.twitter.com/IsAabGPJi7— YoursJaskier (@JaskierYours) April 2, 2023
Also Read: Budget Smartphone Under 10000: 10 వేలకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్.. డిజైన్, లుకింగ్ అదుర్స్! 5000 బ్యాటరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి