Sunita Kejriwal: ఢిల్లీ పగ్గాలు కేజ్రీవాల్ భార్య సునీతా చేతికేనా

Sunita Kejriwal: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన చేస్తుంటే..ఇన్నాళ్లూ ఇంటికి పరిమితమైన ఆయన భార్య సునీత యాక్టివ్ అవుతున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 31, 2024, 03:16 PM IST
Sunita Kejriwal: ఢిల్లీ పగ్గాలు కేజ్రీవాల్ భార్య సునీతా చేతికేనా

Sunita Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన చేస్తున్నారు. ముఖ్యమైన ఆదేశాలు జైలు నుంచే జారీ చేస్తున్నారు. కొన్ని నిర్ణయాలను తన భార్య సునీతా కేజ్రీవాల్ ద్వారా మంత్రివర్గానికి చేరవేస్తున్నారు. తప్పని పరిస్థితులు ఏర్పడితే ఢిల్లీ పగ్గాలు కూడా ఆమె చేతికే ఇవ్వచ్చని తెలుస్తోంది. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల అదుపులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. మరోవైపు ఆయన అరెస్టుకు నిరనసగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఢిల్లీ అసెంబ్లీను సైతం స్థంబింపజేశారు. లోక్‌సభ ఎన్నికల గడువు సమీపిస్తున్నకొద్దీ ఆందోళన తీవ్రతరం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ ఢిల్లీలో భారీ ఎత్తున ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. రామ్‌లీలా మైదానంలో రోజంతా నిరసన కొనసాగనుంది. ఈ ఆందోళనకు అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సైతం హాజరుకానున్నారు. ఇండియా కూటమి నేతలతో కలయిక, రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడం ఆమెకు ఇదే తొలిసారి కానుంది. 

భర్త అరెస్టుకు వ్యతిరేకంగా విమర్శలకే పరిమితమైన సునీతా కేజ్రీవాల్ ఇప్పటివరకూ ప్రత్యక్షంగా ఎప్పుడూ రాజకీయాల్లో పాల్గొనలేదు. జైలు నుంచే పరిపాలన చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ విషయంలో విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఒకవేళ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఢిల్లీ పగ్గాలు సునీత చేతికి ఇవ్వచ్చని తెలుస్తోంది. అంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా సునీతా కేజ్రీవాల్ బాథ్యతలు స్వీకరించే అవకాశాలు లేకపోలేదు. 

మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌పై ఏప్రిల్ 3వ తేదీన డిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ పిటీషన్‌పై వాదనలు జరిగాయి. తదుపరి విచారణ ఏప్రిల్ 3న జరగనుంది. 

Also read: Zakat Calculation: ఇస్లాంలో జకాత్ అంటే ఏమిటి, ఎంత తీయాలి, ఎవరు ఎవరికి చెల్లించాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News