Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామం.. తీహర్ జైలులో అరెస్టు చేసిన సీబీఐ..

Delhi Liquor Policy: లిక్కర్ స్కామ్ కేసులో కవితకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను కోర్టు ఏప్రిల్ 23 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆమె ప్రస్తుతం తీహర్ జైలులో ఉన్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 11, 2024, 03:03 PM IST
  • తీహర్ జైలులో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ..
  • వంద కోట్ల అవినీతిలో వెలుగులోకి కీలక సమాచారం..
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామం.. తీహర్ జైలులో అరెస్టు చేసిన సీబీఐ..

MLC K Kavitha Arrested By CBI In Tihar Jail: దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ప్రస్తుతం పెను సంచలనంగా మారింది. ఇప్పటికే ఈకేసులో ఈడీ అధికారులు దూకుడును పెంచారు. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి కోర్టులో ప్రవేష పెట్టారు. అదేవిధంగా ప్రస్తుతం కవిత తీహర్ జైలులో ఉన్నారు. తన కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కూడా కవిత కోర్టులో పలుమార్లు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈడీ అధికారులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. కవిత బైటకు వస్తే.. లిక్కర్ కేసులో ఉన్నవారిని ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టు వారికి తెలిపింది. కోర్టు కూడా ఈడీ వాదనలతో ఏకీభవించి, బెయిల్ ఇవ్వలేమని తెల్చిచెప్పింది.

Read More: Ayodhya: అయోధ్య బాల రాముడికి 7 కిలోల బంగారు రామాయణం బహుమతి..

ఇదిలా ఉండగా కోర్టు కవితకు ఏప్రిల్ 23 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు గురువారం ఊహించనిషాక్ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ కవితను, జైలులో నుంచి అరెస్టు చేసింది. కాగా, ఈ     మనీలాండరింగ్ కేసులో నిందితులుగా ఉన్న బుచ్చిబాబు వాట్సాప్, ఫోన్ కాల్స్ లను పోలీసులు తనిఖీలు చేశారు. అదే విధంగా ఈ వాట్సాప్ చాటింగ్ లో పలు కీలక సమాచారంను సీబీఐ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. 

లిక్కర్ పాలసీలో.. దాదాపు వందల కోట్ల అవినీతి జరిగిందని సీబీఐ అధికారులకు మరో కీలకమైన డాటా దొరికినట్లు తెలుస్తోంది. దీంతో సీబీఐ అధికారులు.. విచారణ నిమిత్తం ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టు ధర్మాసనం ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

Read More: PM MOdi Fan Cut His Finger:మోదీ హ్యట్రిక్ పీఎం కావాలి.. వేలుకోసుకొని కాళీకా దేవికి అర్పించిన అభిమాని.. ఎక్కడంటే..?

కేంద్ర ఏజెన్సీల దర్యాప్తును ‘మీడియా విచారణ’గా పేర్కొంటూ తన ప్రతిష్టను దెబ్బతీసిందని, తన గోప్యతకు భంగం కలిగించిందని ఎమ్మెల్సీ కవిత కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. "తాను బాధితురాలినని..  నా వ్యక్తిగత ,  రాజకీయ ప్రతిష్టను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన  మొబైల్ ఫోన్ అన్ని టెలివిజన్ ఛానెల్‌లలో ప్రదర్శించబడుతుదని, ఇది నేరుగా నా గోప్యతను దెబ్బతీస్తుందని ఆమె తన న్యాయవాది కోర్టులో చదివిన లేఖలో పేర్కొన్నారు. ఏజెన్సీలకు సహకరించి,  బ్యాంకు ఖాతా వివరాలన్నీ ఇచ్చాను. నేను ధ్వంసం చేసినట్లు ED క్లెయిమ్ చేసిన అన్ని మొబైల్ ఫోన్‌లను అందజేస్తానని కూడా లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News