Delhi Night Curfew: పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు, ఇవాళ్టి నుంచి ఢిల్లీలో నైట్‌కర్ఫ్యూ, ఎవరికి మినహాయింపు

Delhi Night Curfew: ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్రం కోవిడ్ ఆంక్షలు కఠినతరం చేసింది. ఈ రోజు నుంచి నైట్‌కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఎమర్జన్సీ సేవలకు మినహాయింపు ఇచ్చింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 27, 2021, 01:24 PM IST
Delhi Night Curfew: పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు, ఇవాళ్టి నుంచి ఢిల్లీలో నైట్‌కర్ఫ్యూ, ఎవరికి మినహాయింపు

Delhi Night Curfew: ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్రం కోవిడ్ ఆంక్షలు కఠినతరం చేసింది. ఈ రోజు నుంచి నైట్‌కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఎమర్జన్సీ సేవలకు మినహాయింపు ఇచ్చింది.

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన రేపుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదవుతుండటంతో కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. అటు ప్రపంచ దేశాల్లో సైతం ఒమిక్రాన్ ప్రతాపం చూపిస్తోంది. దేశంలో అప్పుడే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 578కు చేరుకున్నాయి. దేశంలో అత్యధికంగా ఢిల్లీలో 142 కేసులు నమోదయ్యాయి. 141 కేసులతో మహారాష్ట్ర రెండవ స్థానంలో నిలిచింది. ఒమిక్రాన్ సంక్రమణ నేపధ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు విధించారు. నూతన సంవత్సర వేడుకల్ని నిషేధించారు. ఢిల్లీలో ఒమిక్రాన్ (Omicron Variant) సంక్రమణ ముప్పును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే క్రిస్మస్ వేడుకల్ని అనుమతించలేదు. మరోవైపు రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి నైట్‌‌కర్ఫ్యూ విధించారు. 

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi Lockdown) ఇవాళ్టి నుంచి అమల్లో ఉన్న నైట్‌కర్ఫ్యూ (Night Curfew) ప్రకారం రాత్రి 11 గంటల్నించి ఉదయం 5 గంటల వరకూ రాకపోకలు, జన సంచారం నిషిద్దం. స్థానికంగా ఉండే చిన్న చిన్న దుకాణాల్నించి కూరగాయలు, పాలు వంటి నిత్యావసర వస్థువుల కోసం కాలినడక వెళ్లేవారికి అనుమతి ఉంటుంది. అదే విధంగా ఎయిర్‌పోర్ట్ లేదా రైల్వే స్టేషన్ లేదా బస్టాండ్‌ల నుంచి వచ్చేవారికి, వెళ్లేవారికి నైట్‌కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. దీనికి సంబంధించి టికెట్ లేదా బోర్డింగ్ పాస్ చూపించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులకు మినహాయింపు ఉంటుంది. ఫుడ్, మెడిసిన్, ట్రీట్మెంట్ సంబంధిత డెలివరీలకు మినహాయింపు ఉంది. 

దేశంలో కరోనా ఒమిక్రాన్ కేసులు 578 కు చేరుకోగా, ఢిల్లీలో అత్యదికంగా 142 కేసులు, మహారాష్ట్రలో అత్యధికంగా 141, కేరళలో 57, గుజరాత్‌లో 49, రాజస్థాన్ లో 43, తెలంగాణలో 41 కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీలో ఇప్పటి వరకూ 6 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో 37 శాతం కేసులు పెరగడం విశేషం. 

Also read: India Omicron Update: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ సంక్రమణ, కొత్తగా ఎన్ని కేసులంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News