Manish Sisodia Arrested In Delhi Liquor Scam: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సిసోడియాను ఈడీ గురువారం రెండోసారి ప్రశ్నించింది. ఈ మేరకు మంగళవారం నుంచి మూడు రోజుల జైలులో సిసోడియాను ఈడీ ప్రశ్నించింది. విచారణ అనంతరం సిసోడియాను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 20 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. సీబీఐ కేసులో ఆయన బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనున్న నేపథ్యంలో ఈడీ అరెస్ట్ చేయడం గమనార్హం.
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సిసోడియా వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఈడీ అధికారులు తీహార్ జైలుకు చేరుకున్నారు. మంగళవారం నుంచి సిసోడియాను విచారించేందుకు ఈడీ కోర్టు అనుమతి తీసుకుంది. ఆయనను అరెస్ట్ చేసేందుకు ఈడీ లా చట్టంలోని సెక్షన్ 19ని అమలు చేస్తుంది. ఇది కేసులో ప్రమేయం ఉన్న లేదా నిందితులను అరెస్టు చేయడానికి అనుమతిస్తుంది.
తీహార్ జైలులో ఉన్న మనీష్ సిసోడియా భద్రతపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆయనను ఇతర నేరస్థులతో పాటు ఉంచుతున్నట్లు ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను జైలు అధికారులు తోసిపుచ్చారు. జైలులోని విపాసనా సెల్‌లోకి సిసోడియాకు పర్మిషన్ ఇవ్వలేదని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ఈ ఆరోపణలను నిరాధారమైనవని కొట్టిపారేసిన ఢిల్లీ జైళ్ల అధికారులు.. మనీష్ సిసోడియాను తీహార్ సెంట్రల్ జైలు నంబర్ 1లోని వార్డులో ఉంచారు. ఈడీ మూడు రోజుల విచారణ అనంతరం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈ నెల 11న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఇదే కేసులో సిసోడియాను ఈడీ అరెస్ట్ చేయడంతో కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. కవిత ఈడీ విచారణ సందర్భంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: MLC Kavitha: ప్రెస్‌మీట్ లైవ్‌లోనే ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు
Also Read: Minister KTR: మోదీ సర్కార్ చేతిలో ఈడీ కీలు బొమ్మ.. సీబీఐ తోలు బొమ్మ: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు a
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook