ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీలో వరుసగా  జరుగుతున్న అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరుసగా వెంట వెంట మూడు అగ్ని ప్రమాదాలు జరగడం ఢిల్లీ వాసుల్లో  ఆందోళన కలిగిస్తోంది.

Last Updated : Dec 23, 2019, 11:43 AM IST
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీలో వరుసగా  జరుగుతున్న అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరుసగా వెంట వెంట మూడు అగ్ని ప్రమాదాలు జరగడం ఢిల్లీ వాసుల్లో  ఆందోళన కలిగిస్తోంది. ఫిల్మిస్తాన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన మరువక ముందే ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. కిరారీ ప్రాంతంలోని ఓ బట్టల గోదాములో మంటలు చెలరేగాయి.  ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు.  
నిద్రలోనే సజీవ దహనం
అగ్ని ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో  నిద్రలో ఉన్న వారు నిద్రలోనే సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. నాలుగు అంతస్తులు ఉన్న భవనంలో బట్టల గోదాము మొదటి అంతస్తులో ఉన్నట్లు తెలుస్తోంది. అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో  ఫైర్ సిబ్బంది .. ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఐతే బట్టల గోదాము కావడంతో మంటలు ఆర్పేందుకు వారు ఎక్కువగా శ్రమించాల్సి వచ్చింది. బట్టలన్నీ కాలిపోయి .. దట్టమైన పొగ అలుముకుంది. దీంతో ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. చనిపోయిన 9 మందిలో ఐదుగురు మహిళలు ఉన్నారు.

 
ఫిల్మిస్తాన్ తరహాలోనే.. 
ఈ నెల 8న ఢిల్లీ ఫిల్మిస్తాన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆనాటి ఘటనలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదం కారణంగా దట్టమైన పొగ అల్లుకోవడంతో .. ఊపిరాడక చాలా మంది మృతి చెందారు.

Trending News