Delhi Chalo protest: ఉద్రిక్తంగా ‘ఢిల్లీ ఛలో’ మార్చ్

కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్‌ యూనియన్‌ పిలుపునిచ్చిన ఢిల్లీ ఛలో మార్చ్‌ (Delhi Chalo protest) ఉద్రిక్తంగా కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించినప్పటికీ రైతులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా పలుప్రాంతాల నుంచి ఢిల్లీ వైపు పయనమవుతున్నారు. 

Last Updated : Nov 27, 2020, 01:06 PM IST
Delhi Chalo protest: ఉద్రిక్తంగా ‘ఢిల్లీ ఛలో’ మార్చ్

Delhi Chalo farmer's protest: న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు (new farm laws) వ్యతిరేకంగా భారతీయ కిసాన్‌ యూనియన్‌ పిలుపునిచ్చిన ఢిల్లీ ఛలో మార్చ్‌ (Delhi Chalo protest) ఉద్రిక్తంగా కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించినప్పటికీ రైతులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా పలుప్రాంతాల నుంచి ఢిల్లీ వైపు పయనమవుతున్నారు. 

అయితే గురువారం ప్రారంభమైన ఈ ఆందోళన శుక్రవారం కూడా కొనసాగుతూనే ఉంది. చలిని సైతం లెక్కచేయకుండా ఢిల్లీ సరిహద్దుకు చేరిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు శుక్రవారం ఉదయం టియర్‌ గ్యాస్‌‌ను ప్రయోగించారు. కొన్నిచోట్ల లాఠిఛార్జ్ చేయడంతోపాటు జల ఫిరంగులను సైతం ప్రయోగించారు.

ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి అన్నదాతలు ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ పరిసరాల్లోకి ఆయా రాష్ట్రాల నుంచి ఎవరూ రాకుండా సరిహద్దుల్లో భారీగా పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. 

ఢిల్లీలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టంచేశారు. అంతేకాకుండా హర్యానా ప్రభుత్వం జాతీయ సరిహద్దులను సైతం మూసివేసింది. Also read: Delhi Chalo protest: ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x