Delhi Pollution: ప్రమాదకరంగా ఢిల్లీ కాలుష్యం, స్కూళ్లకు ముందే వింటర్ సెలవులు

Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకూ తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. గాలి నాణ్యత అంతకంతకూ పడిపోతోంది. పరిస్థతి ప్రమాదకరంగా మారుతుండటంతో స్కూళ్లకు ముందే వింటర్ బ్రేక్ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 8, 2023, 05:40 PM IST
Delhi Pollution: ప్రమాదకరంగా ఢిల్లీ కాలుష్యం, స్కూళ్లకు ముందే వింటర్ సెలవులు

Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీ వాతావరణ ప్రమాదకరంగా మారింది. ఓ వైపు కాలుష్యం, మరోవైపు పొగమంచు ఢిల్లీని కమ్మేస్తోంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో పరిస్థితి మరింతగా విషమించడంతో స్కూళ్లకు వింటర్ హాలిడేస్ ఇచ్చేశారు. 

దేశ రాజధాని ఢిల్లీ ప్రమాదపుటంచుల్లో నిలిచింది. కాలుష్యం తీవ్రంగా పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రోజురోజుకూ ప్రమాదకరస్థాయికి చేరుకుంటోంది. వాయు కాలుష్యం తీవ్రత పెరిగిపోతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సెలవుల్ని పొడిగించింది. నవంబర్ 9 నుంచి 18 వరకూ సెలవులు పొడిగించింది. దేశ రాజధానిలో కాలుష్యం స్థాయి తీవ్రమైన జోన్‌లోకి చేరింది. రానున్న రోజుల్లో కాలుష్యం మరింత పెరగవచ్చని అంచనా. ఢిల్లీలోని 37 మానిటరింగ్ స్టేషన్లలో కనీసం 18 కేంద్రాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తీవ్ర విభాగంలో నమోదైంది. 

సాధారణంగా ఢిల్లీలో వింటర్ హాలిడేస్ డిసెంబర్-జనవరి మధ్యలో ఉంటాయి. కానీ కాలుష్యం దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఇచ్చేశారు. 10, 12 తరగతులు తప్ప మరెవరికీ ఆఫ్‌లైన్ క్లాసులు ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో నిర్దేశిత కాలుష్యం కంటే 30-40 రెట్లు ఎక్కువగా నమోదవుతోంది. వాస్తవానికి డిల్లీ కాలుష్యం నియంత్రణకు సరి బేసి విధానం అమలు చేద్దామని అనుకున్నా...ఈ విధానంపై రివ్యూ అవసరమని సుప్రీంకోర్టు భావించడంతో ఇంకా అమలు చేయడం లేదు. 

Also read: Nitish Kumar: మహిళలపై అభ్యంతకర వ్యాఖ్యలు.. ముఖ్యమంత్రి క్షమాపణలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News