Gang Rape: దారుణం... లిఫ్ట్ అడిగిన పాపానికి మహిళపై గ్యాంగ్ రేప్...

Delhi woman gang raped: తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తిని లిఫ్ట్ అడిగిన ఓ మహిళ అత్యాచారానికి గురైంది. ఇద్దరు వ్యక్తులు ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2021, 02:49 PM IST
  • ఢిల్లీలో గ్యాంగ్ రేప్ ఘటన
  • 34 ఏళ్ల మహిళపై ఇద్దరు గ్యాంగ్ రేప్
  • లిఫ్ట్ అడిగినందుకు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యం
Gang Rape: దారుణం... లిఫ్ట్ అడిగిన పాపానికి మహిళపై గ్యాంగ్ రేప్...

Delhi woman gang raped: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణం జరిగింది. ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. లిఫ్ట్ అడిగిన పాపానికి ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. పశ్చిమ ఢిల్లీలోని హరినగర్ ప్రాంతంలో సోమవారం (డిసెంబర్ 27) ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని సాగర్‌పూర్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున 3గం. సమయంలో ఓ మహిళ (34) గుర్తు తెలియని వ్యక్తిని లిఫ్ట్ అడిగింది. సమీపంలోని బంధువుల ఇంటి వద్ద దింపాలని కోరింది. దీంతో అతను ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. కారులో అప్పటికే అతనితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు.  

సాగర్‌పూర్ నుంచి నిహల్ విహార్ ప్రాంతం వైపు వెళ్లిన ఆ కారు.. అక్కడికి సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఆగింది. అక్కడే ఇద్దరు కలిసి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై ఐపీసీ సెక్షన్ 376డీ (గ్యాంగ్ రేప్) కింద కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన రోజు నిందితుల్లో ఒకరి బర్త్ డే అని... ఆరోజు ఇద్దరు బర్త్ డే సెలబ్రేషన్స్‌లో మునిగితేలారని చెప్పారు.

ఈ ఘటనపై మహిళ ఫిర్యాదును స్వీకరించేందుకు స్థానిక పోలీసులు మొదట నిరాకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలను వారు ఖండించారు. ఘటన (Gang Rape) జరిగిన ప్రాంతం ఏ పోలీస్ స్టేషన్‌ పరిధిలోకి వస్తుందనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ నెలకొనడంతో ఎఫ్ఐఆర్ నమోదుకు కాస్త సమయం పట్టిందన్నారు.

Also Read: Mohammed Shami: 200 వికెట్ అనంతరం.. షమీ ఎమోషనల్ సెలబ్రేషన్స్! ఎవరి కోసమో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News