గుర్రంపై ఊరేగుతున్నాడని దళిత వరుడిపై రాళ్లదాడి

దళిత యువకుడిపై దాడి జరిగింది. పెళ్లి వేడుకలో భాగంగా గుర్రంపై ఉరేగుతుంటే అడ్డుకుని అగ్రవర్గాల వారు రాళ్లదాడికి పాల్పడ్డారు. గుజరాత్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 18, 2020, 09:33 AM IST
గుర్రంపై ఊరేగుతున్నాడని దళిత వరుడిపై రాళ్లదాడి

అహ్మదాబాద్: గుజరాత్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. గుర్రంపై ఊరేగుతున్నాడన్న కారణంగా దళిత యువకుడిపై ఠాకూర్ వర్గీయులు రాళ్లదాడికి పాల్పడ్డారు. గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలో ఈ ఘటన జరిగింది. గతేడాది ఏప్రిల్‌లో అరావళి జిల్లాలోనూ ఇదే విధంగా దాడి జరగడం తెలిసిందే. పోలీసుల కథనం ప్రకారం.. బనస్కాంతలోని సందీపాడ గ్రామానికి ఆకాష్ కోటాడియా (27) అనే దళిత యువకుడు ఆర్మీలో సేవలందిస్తున్నాడు. అతడికి జమ్మూ కాశ్మీర్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఇటీవల తన పెళ్లి నిమిత్తం గ్రామానికి వచ్చాడు. ఆదివారం ఆర్మీ జవాన్ ఆకాష్ వివాహం జరిగింది.

Also Read: మలైకా అరోరా, అర్జున్ రిలేషన్ దెబ్బకొట్టింది! 

పెళ్లి బరాత్ సమయంలో వరుడు ఆకాష్ గుర్రం మీద ఎక్కుతున్న క్రమంలో అగ్రవర్గాల వారు అతడిని అడ్డుకున్నారు. గుర్రంపై ఎక్కవద్దని మామూలుగానే బరాత్ చేసుకోవాలని హెచ్చరించారు. ఇవేమీ పట్టించుకోని ఆకాష్ గుర్రంమీద ఎక్కాడు. దీంతో ఆగ్రహించిన అగ్రకులాలకు చెందిన వారు వరుడిపై రాళ్లదాడికి పాల్పడి అమానుషంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో బరాత్‌లో పాల్గొన్న ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. గార్బా డ్యాన్స్ చేస్తున్న కొందరు మహిళలకు గాయాలయ్యాయని బనస్కాంత దళిత సమాజ్ అధ్యక్షుడు దల్పత్ భాయ్ భాటియా తెలిపారు.

Also Read: బికినీలో బిగ్ బాస్ బ్యూటీ.. వైరల్ 

ఆ గ్రురం కూడా అగ్రవర్గం ఠాకూర్ వర్గానికి చెందిన వ్యక్తిదని గుర్రం ఎలా ఎక్కుతావని తమని అడ్డుకున్నట్లు భాటియా వెల్లడించారు. పెళ్లి కోసం తీసుకొచ్చిన డీజే సౌండ్ సిస్టమ్ కూడా రాళ్లదాడిలో దెబ్బతింది. సమాచారం అందుకున్న గధ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్మీ జవాన్ ఆకాష్ వివాహ బరాత్ కార్యక్రమం పోలీసుల సంరక్షణలో జరిపించారు. బరాత్ తర్వాత కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Also Read: ప్రేయసితో హీరో నిఖిల్ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్ 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News